రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  0
  2814

  వీడు మామూలోడు కాదు ,వెయ్యి మంది మహిళలను మంచి పది కోట్ల రూపాయలకు పైగా కొట్టేసాడు. మోసపోయిన మహిళలల్లో పెళ్లికాని యువతులు , వితంతువులు ఎక్కువగా ఉన్నారు . ఉద్యోగాలు ,ప్రేమ ,పెళ్లి ఇలాంటి పేర్లతో మహిళలను ముగ్గులోకి దించి పెద్ద ఎత్తున డబ్బులు కొట్టేసి దర్జాగా బతికేస్తున్నాడు. వీడిని పట్టుకునేందుకు హైదరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర రెండు నెలల పాటు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి ఎట్టకేలకు పట్టేశారు.

  వీడిది రాజమండ్రి దగ్గర రామచంద్ర రావు పేట. పేరు వంశీకృష్ణ. 2014లో బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు . ఆ పని ఈ పని చేసుకుంటూ క్రికెట్ బెట్టింగ్ , గుర్రప్పందాలకు అలవాటు పడటం స్నేహితుల దగ్గర అప్పులు చేశాడు . అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో మహిళల పేరుతో ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశాడు . గాయత్రి ,మాధురి ,సాత్విక ,శ్వేత ఇలా రకరకాల పేర్లతో అకౌంట్ ఓపెన్ చేసి అబ్బాయిలకు వల వేసి డబ్బులు దండుకుని జల్సాగా బతికేవాడు.

  మరో కోణంలో , మగవాళ్ళ పేర్లతో అకౌంట్ ఓపెన్ చేసి వితంతు మహిళలను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేసేవాడు. ఇలా రకరకాల మోసాలతో వెయ్యి మంది ఆడవాళ్ళని బురిడీ కొట్టించాడు. ఇలా దాదాపు 10 కోట్ల రూపాయలు ఈ విధంగా మోసం చేసి నేరాలకు పాల్పడ్డారు . మరో సంఘటనలో యానాం ఎమ్మెల్యే శ్రీనివాస్ అశోక్ పేరుతో కూడా అకౌంట్ ఓపెన్ చేసి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి లక్షల రూపాయలు నిరుద్యోగులనుంచి కొట్టేసాడు.

  2016 నుంచి వీడి చీటింగ్ వ్యవహారాలు మొదలయ్యాయి . ఐదేళ్లలోనే 10 కోట్ల రూపాయలు దండుకుని మహిళలను మోసం చేసారు.. ఇప్పటివరకూ 60 మంది మహిళలు వీడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ ,ఆంధ్ర రాష్ట్రాల కు చెందిన వాళ్లు వీడి మోసానికి బలైన వారు ఎక్కువగా ఉన్నారు..

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.