రెండు నాణేల కోసం మళ్ళీ వేట మొదలైంది.

    0
    380

    ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నాణెం మన దేశం వేట మొదలైంది.. ఆ నాణెంవిలువ తెలిస్తే ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే.. దాదాపుగా 11 కేజీల బంగారు నాణెం అది.. సుమారుగా 11935 గ్రాముల బంగారు నాణెం ఇది.. ఇంత వరకూ ప్రపంచంలో ఎవరూ ముద్రించలేదు.. 35 ఏళ్లుగా దీనికోసం వెతుకులాట కొనసాగుతోంది.. 1613లో జహంగీర్ దీనిని తయారు చేయించాడు. జహంగీర్ 8 సంవత్సరాలను పురస్కరించుకొని ఈ ప్రత్యేక నాణేన్ని తయారుచేయించారు. అయితే అక్కడి నుంచి చాలా చేతులు మారి.. చివరిగా హైదరాబాద్ చివరి నిజాం ముక్రం ఝాకి ఈ నాణెం వచ్చి చేరింది. దీనిని నిజాం రాజు ముక్రం ఝా స్విట్జర్ ల్యాండ్ లోని స్విస్ బ్యాంకు లో వేలం వేయించాలని చూశాడు. అయితే ఎందుకో అది నిలిచిపోయింది.

    1693లో షాజహాన్ ఇలాంటి మరొక కాయిన్ తయారు చేయించాడు. రెండవ కాయిన్ ఇరాన్ రాజు రాయబారి యాద్గార్ అలీ వద్ద ఉండేది. చివరిసారిగా 1987లో ఆ నాణేన్ని హాప్స్ బర్గ్ ఫిల్డ్ మాన్ జెనీవాలో హోటల్ మోగా వద్ద వేలానికి పెట్టినప్పుడు మన దేశానికి సమాచారం ఇచ్చారు. అయితే ఇది భారతదేశానికి చెందిన వారసత్వ సంపద అని.. ఈ వేలాన్ని ఆపాలని మనదేశ ప్రభుత్వానికి కూడా కొందరు సమాచారం ఇచ్చారు. అయితే అప్పటి ప్రభుత్వం వేలాన్ని ఆపకుండా కేవలం.. సీబీఐ ఎంక్వయిరీ వేసి సరిపెట్టింది.

    తాజాగా ఈ నాణెం గురించిన వివరాలను సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ సంతన్ సేన్ ఓ పుస్తకంలో రాశారు. దీంతో భారత ప్రభుత్వం ఇప్పుడు ఈ నాణేలను వెతకడం ప్రారంభించింది. సౌదీ, ఈజిప్టులకు చెందిన పలువురు ప్రస్తుతం ఈ నాణేల కోసం పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఈ రెండు బంగారు నాణేల విలువ ప్రస్తుతం 1500 కోట్లు వరకూ ఉండవచ్చు. ఈ రెండు బంగారు నాణేలు జెనీవాలోని ఝా అనే వ్యక్తి వద్ద ఉన్నాయని సీబీఐ నిర్ధారించింది. వీటిని ఆ వ్యక్తి స్విస్ బ్యాంకులో కుదువ పెట్టి.. 10 కోట్లు అప్పట్లో తెచ్చుకున్నాడు. ఇప్పుడు కేంద్రం మళ్ళీ వీటిని తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఆ దేశంతో సంప్రదింపులు కూడా జరుపుతోంది.

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.