సోషల్ మీడియాలో అందమైన అమ్మాయిల ఫొటోలతో..

    0
    511

    సోషల్ మీడియాలో ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ ప్లాట్ ఫామ్ ల వేదికగా అమ్మాయిలకు గాలం వేసి పెళ్లి పేరుతోనో, ప్రేమ పేరుతోనో లక్షలు కొల్లగొడుతున్న అబ్బాయిల గురించి మాత్రమే తెలిసినవారికి ఇదో ట్విస్ట్. ప్రియాంక ప్రియదర్శిని అనే అమ్మాయి సోషల్ మీడియాలో అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టి తప్పుడు అకౌంట్లు సృష్టించి లెక్కలేనంత మంది అబ్బాయిలను లక్షల రూపాయల మేర ముంచేసింది. అమ్మాయి ఒరిజినల్ ఫొటో పగలు చూస్తే, రాత్రి కలలోకి వచ్చేటంత వికారంగా ఉంటుంది. అందుకే అందమైన అమ్మాయిల ఫొటోలతో అకౌంట్లు ఓపెన్ చేసి, అబ్బాయిలను బుట్టలో వేసి ముంచేసింది. డాక్టర్ గా, ఇంజినీర్ గా, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా, బ్యుటీషియన్ గా ఇలా రకరకాల వృత్తులతో, వివిధ రకాల ఫొటోలతో 30కి పైగా అకౌంట్లు సృష్టించి కోటి రూపాయలకు పైగా ముంచేసింది.

    ఇప్పటి వరకు పోలీసులకు అందిన సమాచారం ప్రకారం 8మంది అబ్బాయిలు తమను ప్రేమ, పెళ్లి పేరుతో ముంచేసిందని ఫిర్యాదులు చేశారు. ఒక సందర్భంలో తాను డాక్టర్ ని అని, భువనేశ్వర్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నానంటూ సౌరభ్ అనే వ్యక్తికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. చాటింగ్ మొదలు పెట్టి, ఓ రోజు హఠాత్తుగా తన తల్లి చనిపోయిందని, ఆ వెంటనే తండ్రి కూడా చనిపోయాడని, మేనమామ వేధిస్తున్నాడని సానుభూతి డైలాగులు చెప్పింది. అర్జెంట్ గా ఆరున్నర లక్షలు కావాలంటూ ఫోన్ చేసింది. డబ్బులు తీసుకుని ఫోన్ స్విచాఫ్ చేసింది. ఇలా రకరకాల ఫోన్ నెంబర్లతో యువకులను బుట్టలో వేసుకునేది. మరో సందర్భంలో తాను సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ని అంటూ, ఓ యువకుడితో పరిచయం పెంచుకుని తాను కారు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో ఉన్నానని, అర్జంట్ గా 5 లక్షలు కావాలని చెప్పి డబ్బులు గుంజేసింది. ఇలా ఆమె చేతిలో మోసపోయినవారు ఒక్కొక్కరుగా పోలీసులకు కంప్లయింట్ ఇస్తున్నారు.

    ఇవీ చదవండి..

    మాజీ సిఎం భార్య చెల్లెలు, ఫుట్ పాత్ పై యాచన.

    25 సార్లు లేచిపోయింది.. అయినా క్షమించిన భర్త .

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్