మాజీ సిఎం భార్య చెల్లెలు, ఫుట్ పాత్ పై యాచన.

  0
  1918

  ఈమెవరో తెలుసా..? తెలిస్తే మన నేతల బంధుమిత్రులను చూసి ఔరా .. అనుకుంటారు.. మనోడు ఎమ్మెల్యేనో , మంత్రో అయితే సైకిల్ కి గతిలేని వాడు , బెంజ్ కారు కొనే పరిస్థితి నేటి నేతలది.. వాళ్ళ బంధువులది.. ఈమెను చూస్తే రాజకీయాల్లో నీతి ఎలా ఉంటుందో చెప్పనక్కరలేదు. ఈమెపేరు ఇరా బసు.

  పీహెచ్ డి చేసింది.. బహుభాషా కోవిదురాలు.. రిటైర్డ్ టీచర్.. పశ్చిమ బెంగాల్ కి పదేళ్లు సీఎంగా పనిచేసిన బుద్ధదేవ్ భట్టాచార్య , భార్య చెల్లెలు.. ఇప్పుడెక్కడుందో తెలుసా..? ఇళ్ళులేక ప్లాట్ ఫారం పై ఉంది.. తిండిలేక ఎవరో ఒకరు పెడితే తినే పరిస్థితి.. కట్టుకునేందుకు బట్టల్లేని దయనీయ పరిస్థితి..

  మంచి క్రీడాకారిణి కూడా.. మరో విశేషం ఏమిటంటే , రిటైర్ అయినా తరువాత ఆమె పెన్షన్ కి కూడా అప్ప్లై చేసుకోలేదు.. ఇప్పుడు ఆమె పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లా బరాబజార్‌ ప్రాంతంలోని దున్లాప్‌లో ప్లాట్ ఫారం పైనే ఉంటుంది..

  ఆమె దగ్గర చదువుకున్న విద్యార్థులకు ఆమె పరిస్థితి తెలిసి తినేందుకు సాయం చేస్తున్నా , ఆమె జీవితం ఇలాగే ఉంది.. ఈ విషయం సోషల్ మీడియాలో వచ్చిన వెంటనే , అధికారులు ఆమెను వైద్య పరీక్షల కోసం కలకత్తా తీసుకెళ్లారు..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్