జిమ్ లో మరణాలు ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయి , చాలామంది సెలబ్రిటీలే కాదు సామాన్యులు కూడా జిమ్ చేస్తున్నప్పుడు , జిమ్ లోనే కూలిపోతున్నారు. జిమ్ చేసిన తర్వాత గానీ , జిమ్ చేస్తున్నప్పుడుగానీ జిమ్ లో సంభవిస్తున్న మరణాలు ఆందోళన కలిగించే విధంగా ఉంటున్నాయి . జిమ్ లో ఎంత సేపు ఎక్సర్సైజ్ చేయాలి..? ఎలా చేయాలి ?? ఏ విధంగా చేయాలి?? జిమ్ కు వెళ్ళినప్పుడు ఆరోగ్య పరిస్థితి ఏమిటి ?? అన్న విషయంపై సరైన అవగాహన లేకపోవడం, క్వాలిఫికేషన్ లేని ట్రైనర్లు చెప్పే మాటలు వినడం ఆరోగ్య పరమైన విషయాలను పట్టించుకోకుండా పోవడం జిమ్ లో మరణాలకు ఎక్కువ కారణమని వైద్యులు చెబుతుంటారు.
తాజాగా బెంగళూరులో వినయ కుమారి అనే 44 ఏళ్ళ మహిళ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ పడిపోయింది . అదే జిమ్ లో ఉన్న ఇతరులు ఆమెను హాస్పిటల్ కి తరలించేందుకు ప్రయత్నం చేశారు. అయితే దురదృష్టవశాత్తు అప్పటికే ఆమె చనిపోయింది . జిమ్ చేస్తున్నప్పుడు ఇలాంటి సంఘటన సంభవించడం ఇది మొదటిసారి కాదు , ఇలాంటివి చాలా ఉన్నాయి. అందువల్ల ముందుగా తన ఆరోగ్య పరిస్థితిని కూడా చూసుకోవడం మంచిదన్న అభిప్రాయం డాక్టర్ల లో ఉంది .
ఆరోగ్య పరీక్షలు చేయించుకుని ఇబ్బంది ఏమిటో గుర్తించి దానికి అనుగుణంగానే జిమ్లో ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అలా కాకుండా తమ ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోకుండా అతిథిగా ఎక్సర్సైజులు చేసినా , అతిగా వాకింగ్ చేసినా , అతిగా రన్నింగ్ స్విమ్మింగ్ చేసినా ఇలాంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు ..