బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ ‘పఠాన్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కానున్న ఈ సినిమా యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం షారుక్.. తన బాడీ షేప్ ను పూర్తిగా మార్చేశాడు.
8 ప్యాక్స్ తో కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. తన 8 ప్యాక్ బాడీ లుక్ ని ఇన్ స్టా గ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. 55 ఏళ్ళ వయసులోనూ షారుక్ ఫిట్ గా కనిపిస్తున్నాడంటూ నెటిజన్లు, ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.