ఎలెక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలుళ్లు .. భయంగొలిపే నిజాలు..

    0
    221

    ఎల‌క్ట్రిక్ బైకుల‌పై మోజు పెరుగుతున్న నేప‌ధ్యంలో దేశంలో అనేక ప్రాంతాల్లో ఎల‌క్ట్రిక్ బైకులు త‌గ‌ల‌బ‌డి పోవ‌డం, బ్యాట‌రీలు కాలిపోవ‌డం…చివ‌ర‌కు ఇంట్లోని వారు చ‌నిపోవ‌డం.. వంటి సంఘ‌ట‌న‌లు ఆందోళ‌న‌ను క‌లిగిస్తున్నాయి. ఎల‌క్ట్రిక్ బైకులు బ్యాటీల‌పైనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. హైద‌రాబాద్, పూణె, బెంగుళూరు, గుర్గావ్, ఢిల్లీ, అహ్మ‌దాబాద్ ఇలా ఒక‌న‌గ‌ర‌మే కాదు దేశంలో అక్క‌డ‌క్క‌డా ఎల‌క్ట్రిక్ బైకుల బ్యాట‌రీలు పేలుతున్న‌వి చూస్తున్న నేప‌ధ్యంలో త‌మిళ‌నాడులో జ‌రిగిన సంఘ‌ట‌న మ‌రింత భ‌యాందోళ‌న‌ను క‌లిగిస్తోంది.

    రాయ్ వెల్లూరు అల్ల‌పురం ఏరియాలో ఎల‌క్ట్రిక్ బైకు చార్జింగ్ లో సంభ‌వించిన పేలుడులో తండ్రికూతురు చ‌నిపోవ‌డం విషాద‌క‌రం. దురైవ‌ర్మ అనే వ్యక్తి ఈబైక్ కొన్నాడు. దాన్ని ఇంటికి తెచ్చి పూజ చేసి చార్జింగ్ పెట్టారు. ఆ స‌మ‌యంలో ప‌క్క‌నే 13 ఏళ్ళ కూతురు కూడా ఉంది. చార్జింగ్ పెట్టిన వెంట‌నే బైక్ పేలి ఒక్క‌సారిగా మంట‌లు ఎగ‌సాయి. మంట‌ల‌ను ఆర్పేందుకు తండ్రికూతురు ప్ర‌య‌త్నం చేసేలోపే, మంటలు వ్యాప్తించి క్ష‌ణాల్లోనే చ‌నిపోయాడు.

    భ‌యాన‌క‌మైన ఈ సంఘ‌ట‌న‌.. ఈ బైక్ లు అంటేనే భ‌య‌ప‌డే స్థితికి వ‌చ్చింది. మొబైల్ చార్జ‌ర్లు, కిచెన్ కు సంబంధించిన చార్జ‌ర్లు, ఇప్పుడు ఈబైక్ చార్జ‌ర్లు పేలుతుండ‌డంతో ఈ అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పొర‌పాటు ఎక్క‌డ జ‌రుగుతుందో గుర్తించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. బైక్ త‌యారీలోనా, చార్జ‌ర్లు, బ్యాట‌రీ నాణ్య‌త‌లోనా అనేది తేలాల్సి ఉంది. ఇంత‌వ‌ర‌కు దేశంలో ఎల‌క్ట్రిక్ బైకులు చ‌నిపోయిన వారంద‌రిలో పొగ అలుముకుని చ‌నిపోయిన వారే. ముందు పొగ వ‌చ్చి ఆ త‌ర్వాతే మంట‌లు వ్యాప్తిస్తున్నాయి.

    మనదేశంలోనే కాదు , ప్రపంచవ్యాప్తంగా ఈవి బైక్ బ్యాటరీ పేలుళ్లు , బైకులు తగలబడిపోవడం జరుగుతొంది. మార్కెట్ లో పోటీకి , ముందుగా తమ బైకే మార్కెట్ లోకి వచ్చిందని చూపేందుకే , సరైన పరిశోధన , ట్రైల్స్ లేకుండా , ఆర్ అండ్ డి పూర్తికాకుండానే ఈ బైకులు తీసుకొచ్చారు. బ్యాటరీ తయారీ ఇతర కంపెనీలకిచ్చారు. సగానికి పైగా చైనా బ్యాటరీలు వాడుతున్నారు. దేశీయంగా ఇంకా , దీని సాంకేతికత అభివృద్ధి కాకపోవడం లాంటి కారణాలతో నాసిరకం బైకులు వచ్చి ప్రాణాలు తీస్తున్నాయని వాహనరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు..

    ఎక్కడోగానీ ఇవి బైక్ పేలుడు యెంత భయంకరంగా ఉందో చూడండి..

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..