భార్యల మధ్య పోరు , మొగుడు ఉద్యోగం గోవిందా ..

  0
  102

  ఒక్క పెళ్ళాంతో ఏగలేని వాళ్ళ బాధలు ఎన్నెన్నో.. ఇప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగికి ముగ్గురు పెళ్ళాలతో వచ్చిన గొడవతో , ఉద్యోగమే ఊడింది.. ఎందుకో తెలుసా ..? ముగ్గురు భార్యలు , పంచాయతీ ఎన్నికల్లో , ఒకరిమీద ఒకరు సర్పంచ్ పదవికి పోటీచేసి , భర్త ఉద్యోగానికి ఎసరుపెట్టారు. వివరాలు చూడండి.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగరులి జిల్లా మనామస్ గ్రామంలో , సుఖ్ రామ్ సింగ్ , పంచాయతీ కార్యదర్శి . ఆయనకు ముగ్గురు భార్యలు.. ముగ్గురూ వేర్వేరుగా ఉంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు భార్యలు , ఒకరికి పోటీగా మరొకరు సర్పంచ్ పదవులకు నామినేషన్లు వేశారు..

  ఒకరంటే , ఒకరికి పొసగదు కాబట్టి , అటోఇటో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ముగ్గురూ , నామినేషన్ల పేపర్లలో , తమ భర్త పేరు సుఖ్ రామ్ సింగ్ అని రాశారు. దీన్ని విచారించిన ఎన్నికల అధికారి , కలెక్టర్ కి నివేదిక పంపారు.. ముగ్గురు భార్యలూ , ఎన్నికల్లో పోటీకి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా , ముగ్గురు బార్యలున్నందుకు , కలెక్టర్ సుఖ్ రామ్ సింగ్ ని సస్పెండ్ చేశారు.. ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ నోటీసు ఇచ్చారు.. మొత్తానికి , భార్యల మధ్య ఆధిపత్య పోరు , ఇప్పుడు , మొగుడు ఉద్యోగానికి ఎసరు పెట్టింది..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.