భార్యా భర్తలమధ్య రేప్ అంటే ఎలా..?

  0
  294

  భర్త కిరాతకుడే ..దుర్మార్గుడే ..అయినా భార్యా భర్తలమధ్య జరిగే సెక్స్ ని రేప్ అంటే ఎలా అంటూ సుప్రీంకోర్టు నిలదీసింది. సహజీవనం చేస్తున్న ఇద్దరి మధ్య సెక్స్ , పరస్పర అంగీకారంతో జరిగేదే ..అయినా ఇద్దరి మధ్య సంబంధం బెడిసికొట్టినప్పుడు దాన్ని రేప్ అంటూ కేసుపెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించింది. సహజీవనం , లేదా భార్యా భర్తల సంబంధంలో అత్యాచారాలకు స్థానంలేదు అని ప్రధాన న్యాయమూర్తి బాబ్దే అన్నారు.

  వినయప్రతాప్ సింగ్ అనే వ్యక్తి ఓ మహిళతో రెండేళ్లు సహజీవనం చేశాడు. తర్వాత ఇద్దరిమధ్య సంబంధాలు చెడిపోయాయి. దీంతో ఆమె అతడిపై రేప్ కేసు పెట్టింది. పెళ్లిచేసుకుంటానని అతడు ఆమెతో సహజీవనం చేశాడు . తరువాత కాదన్నాడు. అయితే పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చితప్పితే దానికి రేప్ కేసుపెడితే ఎలా అని నిలదీశారు. రేప్ కేసులో అతడిని అరెస్ట్ చేయడం ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. ఒక వేళ సహజీవనంలో అతడు , ఆమెపై దౌర్జన్యం చేసిఉంటే , గృహహింసకింద కేసుపెట్టాలని సూచించారు.

  ఇవీ చదవండి:

  అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

  ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

  ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?