అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..? అనుమానమెందుకు ..??

    0
    6643

    అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..? అనుమానమెందుకు ..?? చేసింది. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ అనేపేరుకంటే , అక్కినేని వారి ఇంటి కోడలుగా ఆమె తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ . ఆమె కూడా పెళ్ళికాకముందు, పెళ్లి అయ్యాక సినిమా వాసన ఉన్నదేకదా ..? ఇలాంటివి మామూలే . సాంప్రదాయవాదులకు అది తప్పుఅనిపిస్తే వాళ్ళకర్మ ,, సమంత ట్వీట్ చేసి ఆ తరువాత తిట్లు , శాపనార్థాలు తట్టుకోలేక తీసేసిన ఫొటో ఇది.. సిగ్గు ఉందాలేదా అన్నది వేరేవిషయం . సిగ్గు అనేపదానికి సినిమా రంగంలో చోటుండదు. సంస్కారం అనే మాటకు కొందరికే వర్తిస్తుంది.. ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌ అనే యువకుడి ఒడిలో కాళ్లు పెట్టుకుని మరీ రిలాక్స్‌ అవుతోంది చూడండి. ఈ ఫొటో చూడగానే అక్కినేని కుటుంబాన్ని అభిమానించే , ఆరాధించే వాళ్ళ మనసులు గాయపడ్డాయి. బహుశా వేరెవరైనా ట్వీట్ చేసిఉంటే మార్పింగ్ అనుకునేవాళ్లు , కానీ సమంతే ఈ ఫొటో ట్వీట్ చేసింది. క్షణాల్లో అభిమానులు ఆగ్రహావేశాలతో ఊగిపోయి , తిట్లకు మళ్లుకొవడంతో ఫొటో తీసేసింది. సామ్‌కు ప్రీతమ్‌ జుకల్కర్‌ నాలుగేళ్లుగా స్టైలిష్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో నాలుగేళ్ల స్నేహానికి గుర్తుగా సామ్‌ అతడితో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో యాడ్‌ చేస్తూ ఐ లవ్‌యూ అని రాసుకొచ్చింది.