ప్రియతమా .. నేనూ నీతో వచ్చేస్తున్నా ..ప్రియురాలి ఆత్మత్యాగం..

  0
  280

  ప్రియతమా .. నేనూ నీతో వచ్చేస్తున్నా ..ప్రియురాలి ఆత్మత్యాగం..
  ===========================///
  ప్రియుడి మరణం ఆమెను వెంటాడింది.. అతడు చనిపోయిన రోజునుంచి నిద్రాహారాలు మానేసింది.. వారంరోజులకే అతడి వియోగం భరించలేక ఆత్మాహుతి చేసుకుంది.. కానరాని లోకాల్లో ఉన్న ప్రియుణ్ణి వెదుక్కుంటూ , కన్నవారికి కడుపుకోత మిగిల్చి వెళ్ళిపోయింది.

  అమ్మాయిది చిత్తూరు .పేరు ‌సుజాత. డిగ్రీ విద్యార్థిని. ఆమె, తన బంధువైన సిలంబర్సన్‌ ప్రేమలో పడ్డారు. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. అందుకు అమ్మాయి బంధువులు ఒప్పుకోలేదు. పెళ్లి జరిపించే ప్రసక్తే లేదని కరాఖండిగా తేల్చి చెప్పారు. దీంతో మనస్తాపానికి లోనైన సిలంబర్సన్‌ చిత్తూరులోని తన నివాసంలో ఫిబ్రవరి 22న ఉరేసుకుని మరణించాడు.

  అతడి మరణంతో సుజాత కుంగిపోయింది. భోజనం మానేసింది. దీంతో ఆమెను తల్లిదండ్రులు చెన్నైలోని బంధువు ఇంటికి పంపించారు. కనీసం అక్కడైనా ఆమె మనసు కుదుటపడుతుందని భావించారు. కానీ తన ప్రియుడు మరణించాడన్న వార్తను జీర్ణించుకోలేకపోయిన యువతి అన్నపానీయాలు తీసుకోవడం మానేసింది.

  దీంతో ఆమె శరీరం కొద్దికొద్దిగా నీరసించిపోగా శుక్రవారం నాడు ఒంటికి నిప్పంటించుకుంది. ఆమె కేకలు విన్న బంధువులు వెంటనే ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన ఆమె శనివారం తుదిశ్వాస విడిచింది. ప్రియుడు చనిపోయిన వారం రోజులకే ఆమె కూడా మరణించడం స్థానికులను కలిచివేసింది.

  ఇవీ చదవండి:

  అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

  ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

  ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?