ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

    0
    666

    సోషల్ మీడియా ప్రభావం మంచి చేసే సంగతి ఎలా వున్నా చిన్నారులపై ప్రతికూల ప్రభావమే చూపిస్తోంది. పిల్లల్లో నేర ప్రవృత్తిని పెంచుతోంది. ఘజియాబాద్ లో ఐదవ తరగతి చదివే 11 ఏళ్ల బాలుడు, తన తండ్రినే బ్లాక్ మెయిల్ చేశాడు. అతని మెయిల్స్ ని హాక్ చేసి.. పదికోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

    యూట్యూబ్ లో సైబర్ క్రైమ్ మెళకువలు, హ్యాకింగ్ ఎలా చేయాలో బాగా నేర్చుకొని.. వాటిని తన సొంత తండ్రిపైనే ప్రయోగించాడు. తండ్రి మొబైల్ లోని కొన్ని ఫోటోలను సేకరించాడు. ఆ ఫోటోలు వేరొక మహిళతో కలిసి ఉండగా తీసినవి. ఆ ఫోటోలను కూడా పంపించి.. తనకు డబ్బివ్వకపోతే.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని కూడా బెదిరించాడు. దీంతో ఆ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. తన ఈ మెయిల్ ఎవరో హ్యాక్ చేశారని.. డబ్బివ్వాలని బెదిరిస్తున్నారని.. తన రహస్య ఫోటోలను సేకరించారని, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

     

    https://www.patrika.com/hot-on-web/11-years-kid-sent-threaten-mail-and-demands-ransom-to-his-dad-6666002/

    హ్యాకింగ్ చేసిన వాళ్ళు.. తన కుటుంబ సభ్యులకు కూడా కాల్ చేసి.. వేధిస్తున్నారని.. గొంతుమార్చి బెదిరిస్తున్నారని చెప్పాడు. ఈ ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ జరపడంతో.. ఫిర్యాదు చేసిన వ్యక్తి ఇంట్లోని, ఇంటర్నెట్ ఐపీ అడ్రస్ నుంచే ఈ కాల్స్, మెయిల్స్ వస్తున్నట్టు గుర్తించారు. దీని వెనుక వున్నది పదకొండేళ్ల అతని కొడుకేనని తేల్చారు. విచారణలో ఆ బాలుడు కూడా తానే ఈ పని చేసినట్టు ఒప్పుకున్నాడు. హ్యాకింగ్ ఎలా చేయాలో యూట్యూబ్ లో వందలకొద్దీ వీడియోలు చూశానని చెప్పాడు. కేసు నమోదు చేసిన పోలీసులు బాల నేరస్తుల కోర్టుకు పెట్టి.. కౌన్సిలింగ్ ఇచ్చి.. బాలుణ్ణి తల్లిదండ్రులకు అప్పగించారు.

     

    https://ndnnews.in/minorsonlinegameturnsblackmailing1044-2/