భర్తపై పెట్రోల్ పోసి తగలబెట్టి, కసి తీరక ఇంకా

  0
  595

  భార్యలపై భర్తలు చేసే దాష్టీకాలు, దుర్మార్గాలు చేసే కాలం పోతున్నట్టుంది. లేదా మగవారితో సమానంగా మహిళలు కూడా భర్తలపై దౌర్జన్యాలకు పూనుకుంటున్నట్టుంది. కర్నాటకలో అన్నపూర్ణ అనే 44 ఏళ్ల మహిళ, అక్రమ సంబంధం మోజలో భర్తపై పెట్రోల్ పోసి తగలబెట్టింది.. నేలమంగళం టోల్ గేట్ వద్ద ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న నారాయణ, అన్నపూర్ణకు పెళ్లై 20ఏళ్లయింది. ఇటీవల కాలంలో ఆమె మరో యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భర్త, పలు దఫాలు ఆమెను మందలించాడు. బిడ్డలు పెద్దవారవుతున్నారని, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని, ఇలా అక్రమ సంబంధంలా పెట్టుకుంటే సంసారం కూలిపోతుందని, బిడ్డలు పక్కదారి పడతారని హెచ్చరించారు.

  అయినా ఆమె వినలేదు. బిడ్డలచేత కూడా చెప్పించి చూశారు. తల్లి ప్రవర్తన మార్చుకోవాలని చెప్పారు. భార్య ఎంతకీ వినకపోవడం, పైగా తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడన్న కక్షతో ప్రియుడు రామకృష్ణ సహాయంతో భర్తను చంపాలని నిర్ణయించుకుంది. దీంతో మొన్న రాత్రి అతడిపై పెట్రోల్ పోసి తగలబెట్టేసింది. ఇంట్లోనుంచి కేకలు వేస్తూ బయటకు వస్తున్న భర్తను ఒక పెద్ద కర్ర తీసుకుని మురికి కాల్వలోకి నెట్టేసింది. ఆ తర్వాత పెద్ద బండ అతని నెత్తిన వేసి చంపేసింది. ఇంత కిరాతకంగా భర్తను హత్య చేసిన ఆ పాతకిని, ఆమె ప్రియుడు రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు.

  ఇవీ చదవండి..

  మాజీ సిఎం భార్య చెల్లెలు, ఫుట్ పాత్ పై యాచన.

  25 సార్లు లేచిపోయింది.. అయినా క్షమించిన భర్త .

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్