భార్యను జీన్స్ ప్యాంట్ ధరించవద్దని భర్త చెప్పడంతో భార్య ఏకంగా భర్తనే చంపేసింది. జార్ఖండ్ లోని గోపాల్ పూర్ అనే గ్రామంలో పుష్ప-హెబ్రామ్ భార్యాభర్తలు. నాలుగు నెలల క్రితమే పెళ్ళయింది. పుష్పకు 18 ఏళ్ళు. హెబ్రామ్‌కు 19 ఏళ్ళు. పెళ్ళయినప్పటి నుంచి భార్య జీన్స్ వేసుకోవడం భర్తకు ఇష్టపడలేదు. ఈ విషయంపై ఇద్దరికీ పలుమార్లు గొడవ కూడా జరిగింది.
ఈనెల 12న ఆమె పక్క ఊరిలో తిరునాళ్ళకు వెళ్ళింది. ఆ సమయంలో భర్త ఇంటికి వచ్చేటప్పటికీ భార్య జీన్స్ ప్యాంట్ వేసుకుని తిరునాళ్ళకు వెళ్ళిందని తెలిసింది. ఆ తర్వాత ఇంటికొచ్చిన భార్యతో ఈ విషయంపై మాట్లాడారు. ఇద్దరికీ తీవ్ర వాగ్వాదం జరిగింది. వాదన ముదరడంతో.. ఆగ్రహంతో ఊగిపోయిన పుష్ప భర్తను కత్తితో పొడిచి చంపేసింది. అత్తమామల ఫిర్యాదుతో పోలీసులు పుష్పను అరెస్ట్ చేసి జైలుకి తరలించారు.