లాకర్లలో సొమ్ము బ్యాంక్ బాధ్యత ఎంతవరకు..?

    0
    407

    సుప్రీం కోర్టు తీర్పు మేరకు బ్యాంకులలో సేఫ్ డిపాజిట్ లాకర్స్ లో ఖాతాదారుల సొత్తుకు పూర్తి భద్రత కల్పిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ సమగ్ర ఆదేశాలను జారీ చేసింది. సోమవారం లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో రాజమండ్రి ఎం.పి శ్రీ మార్గాని భరత్ బ్యాంక్ లాకర్స్ భద్రత పై అడిగిన ప్రశ్నకు ఆర్ధికశాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరాడ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

    ఆర్.బి.ఐ 2021 లో సవరించిన లాకర్ సేఫ్టీ రూల్స్ తాలూకు వివరాలు గురించి, ఖాతాదారుల విలువైన సొత్తు సురక్షితంగా ఉంచడానికి బ్యాంకులు తీసుకుంటున్న చర్యలు గురించి భరత్ ప్రశ్నిస్తూ అనుకోని ఘటనలు, బ్యాంక్ ఉద్యోగుల హస్త లాఘవాలు వంటి సందర్భాలలో బ్యాంకులు పూర్తి బాధ్యత వహిస్తాయా? లేక ఖాతా దారులు బ్యాంకుల దయా దాక్షిణ్యాలపై ఆధారపడాలా! అని కూడా అడిగారు. దేశ సమున్నత న్యాయస్థానం గత ఏడాది ఫిబ్రవరిలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ సంవత్సరం జనవరి నుంచి వర్తించేలా ఆర్.బి.ఐ పకడ్బందీ మార్గదర్శక సూత్రాలను బ్యాంకులకు విడుదల చేసిందని ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు.

    అగ్నిప్రమాదం, చోరీ, దోపిడీ, భవనం కూలిపోవడం వంటి ఘటనలతో పాటు బ్యాంక్ ఉద్యోగులు చేతివాటితనం ప్రదర్శించిన సందర్భాల్లో సేఫ్ డిపాజిట్ లాకర్ వార్షిక అద్దెకు వందరెట్లు మొత్తాన్ని ఖాతాదారుకు పరిహారంగా చెల్లించే నిబంధనలు జోడించినట్లు మంత్రి తెలిపారు. సాధారణ, ఎలక్ట్రానిక్ లాకర్ల రక్షణ-భద్రతల విషయంలో అన్ని రకాల ప్రమాణాలు పాటించాలని, బ్యాంకులు మోడల్ లాకర్ అగ్రిమెంట్ ను అమలు పరచాలని, లాకర్ ఆపరేషన్స్ విషయంలో ఖాతాదారుతో ఎప్పటికప్పుడు ఎస్.ఎం.ఎస్ లు, ఈమెయిల్స్ ద్వారా అనుసంధానం కావాలని ఆర్.బి.ఐ సూచించింది.

    ఏడేళ్ళ పాటు లాకర్ లావాదేవీలు నెరపని సందర్భాల్లోను, వరుసగా మూడేళ్లు లాకర్ అద్దె చెల్లించని పరిస్థితుల్లోను, అనివార్య పరిస్థితుల్లో ఖాతాదారు కోరిన సమయంలోను, లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు అడిగిన పక్షంలోను లాకర్స్ బ్రేక్ ఓపెన్ చెయ్యడానికి కూడా ఆర్.బి.ఐ ఒక సంవిధానాన్ని బ్యాంకులకు సూచించింది. లాకర్స్ కు సంబంధించిన సమగ్ర విధానాన్ని, మోడల్ లాకర్ అగ్రిమెంట్ వివరాలను, లాకర్ లావాదేవీలకు సంబంధించిన నిబంధనావళిని బ్యాంకులు తమ వెబ్ సైట్ లో తప్పనిసరిగా పొందుపరచాలని ఆర్.బి.ఐ. ఆదేశించినట్లు ఎం.పి.భరత్ కు ఇచ్చిన సమాధానం లో ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారు.

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.