వీర్యంకోసంపోరు ఆమె గెలిచింది, మాంగల్యం ఓడింది

  0
  1522

  కోమాలో ఉన్న భర్తనుంచి తనకు వీర్యం కావాలని ఓ మహిళ చేసిన పోరాటం ఫలించింది. వీర్యం సేకరించిన రెండున్నర గంటల్లోనే భర్త చనిపోయాడు. భర్త చనిపోవడం ఖాయం అని డాక్టర్లు చెప్పిన తర్వాత ఆయన చనిపోయినా, ఆయన ప్రతిరూపం కోసం ఆ మహిళ చేసిన న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది. గురువారం రోజు, ఎక్మో మీదున్న ఆయన నుంచి వీర్యం సేకరించిన తర్వాత రెండున్నర గంటల లోనే చనిపోయారు.
  పెళ్లైన ఏడాదికే కరోనా కాటు..
  పెళ్ళైన ఏడాదికే భర్తకు కరోనా సోకింది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆస్పత్రిలో చేర్పించారు. వెంటిలేటర్ పై ఉంచారు. చనిపోతాడని డాక్టర్లు తేల్చేశారు. వెంటిలేటర్ పై జీవచ్ఛవంలా ఉన్న భర్తను చూసిన భార్యకు ఆయన ప్రతిరూపం కావాలనే ఆశ కలిగింది. భర్త చనిపోక ముందే ఆయన నుంచి వీర్యం తీసి ఇవ్వాలని, కృత్రిమ గర్భధారణ ద్వారా ఆయన ప్రతిరూపాన్ని పొందుతానని ఆస్పత్రి సిబ్బందిని కోరింది. అయితే కోమాలో ఉన్న రోగి నుంచి ఇలా వీర్యం తీయడానికి వీల్లేదని చెప్పారు డాక్టర్లు. భార్య అడిగినా సరే , భర్త అనుమతిలేకుండా అది వీలుకాదని చెప్పేశారు. ఒక కోర్టు ఆదేశాలు ఉంటే తప్ప తాము అలా చేయలేమని స్పష్టం చేశారు. దీంతో ఆమె అహ్మదాబాద్ లోని హైకోర్టులో భార్య పిటిషన్ వేసింది. కోర్టు ఈ కేసుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించమని హాస్పిటల్ ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఆస్పత్రి సిబ్బంది భర్తనుంచి వీర్యాన్ని తీశారు. అయితే వీర్యం తీసిన రెండున్నర గంటలకే ఆయన చనిపోవడం విధి విచిత్రం.అయితే భర్త ప్రతిరూపాన్ని గర్భంలో మోయాలని భార్య పడిన తాపత్రయం ఫలించింది. చనిపోడానికి ముందే అతడినుంచి డాక్టర్లు వీర్యాన్ని సేకరించి భార్యకు ఇవ్వడం నిజంగా విధి విచిత్రమే.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?