జై పాతాళభైరవి పెళ్లి కొడుకు..

  0
  188

  జానపద కథల్లో పాతాళంలో ఉన్న పాము పడగమీద మణిని తీసుకొస్తే ఒకరాజు తన కూతుర్ని ఇస్తానని, లేదా స్వర్గలోకంలో ఉన్న స్వర్ణ కమలం తెచ్చిస్తే, కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని, ఇలాంటి కథలు, కహానీలు మనం ఎన్నో విన్నాం. అలాంటి కథలతో సినిమాలు కూడా వచ్చాయి. అయితే అవి కథలు కాదు, నిజ జీవితంలో కూడా అలాంటివే జరిగాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో పెళ్లి కొడుకు, అతని తల్లిదండ్రులు నిశ్చితార్థం అయిన తర్వాత పెళ్లికి సవాలక్ష కోర్కెల చిట్టా బయట పెట్టారు. నిశ్చితార్థం సమయంలో 2 లక్షల రూపాయల నగదు, బంగారం తీసుకున్న పెళ్లి కొడుకు పెళ్లి తేదీకి ముందే ఇవన్నీ లిస్ట్ పంపారు. వాటిలో 21 గోళ్లు ఉన్న తాబేలు, నల్ల లాబ్రడార్ కుక్క, గౌతమ బుద్ధిడి విగ్రహం, బంగారపు దీపపు కుందెన, 10 లక్షల రూపాయల డబ్బు.. ఇవన్నీ తీసుకొస్తే పెళ్లికి ముందుకొస్తానని చెప్పాడు. 21 గోళ్లు ఉన్న తాబేలు ఇంటికి వస్తే అదృష్టం కలసి వస్తుందని ఎక్కువ డబ్బు కూడా వస్తుందని ఆ డబ్బు వచ్చేందుకు 10 లక్షల రూపాయలతో వ్యాపారం చేయాలని ఇలా చెప్పారట. అవన్నీ దొరికినా 21 గోళ్లు ఉన్న తాబేలు ఎక్కడ దొరుకుతుందో అర్థం కాక, పెళ్లి కూతురు కుటుంబం, దీని వెనకున్న మోసాన్ని గ్రహించింది. దీంతో ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై సాధనా అవహాద్, పెళ్లి కొడుకుని, వారి తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేసి జైలుకి పంపారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?