జీన్స్ వేసుకుందని తాత కొట్టి చంపేశాడు..

  0
  551

  17ఏళ్ల బాలిక జీన్స్ ప్యాంట్ వేసుకుందని తాత, మేనమామలు కొట్టి చంపేశారు. ఉత్తర ప్రదేశ్ లోని సవేరి ఖర్గ్ అనే గ్రామంలో నేహా పాశ్వాన్ అనే బాలిక జీన్స్ ప్యాంట్ వేసుకుని తిరగడం తాతకు, మేనమామకు నచ్చలేదు. తన తండ్రి బతికుండగా ఆమె పంజాబ్ లోని లూథియానాలో ఉండేది. తండ్రి చనిపోవడంతో తల్లి తన పుట్టింటికి వచ్చేసింది. సవేరి ఖర్గ్ అనే గ్రామంలో తాత, మేనమామతో కలసి తల్లి కూతుళ్లు ఉండేవారు. అయితే లూధియానాలో నివశించిన అలవాటుతో గ్రామంలో కూడా జీన్స్ ప్యాంట్ వేసుకుని తిరిగేది ఆ బాలిక అలా తిరిగుతుండటంతో, తాత జీన్స్ వేసుకోవద్దంటూ మందలించాడు. అయినా బాలిక వినకుండా జీన్స్ ప్యాంట్ వేసుకుని గ్రామంలో తిరుగుతుండటంతో ఇంట్లో ఆమెను గోడకేసి కొట్టాడు. దీంతో ఆ బాలిక తల పగిలి చనిపోయింది. ఆ తర్వాత రాత్రి ఆటోలో శవాన్ని తీసుకెళ్లి పాట్నా జాతీయ రహదారిలో ఓ వంతెన కింద పడేశారు. అయితే మృతదేహం కిందపడకుండా వంతెన గ్రిల్స్ కి చిక్కుకుని వేలాడింది. దీంతో కొంతమంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, విచారణలో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో ఆ బాలిక తాతను అరెస్ట్ చేశారు, మేనమామ పరారీలో ఉన్నాడు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?