భర్త ప్రాణం కాపాడేందుకే జైలుకు పంపిన భార్య.

  0
  972

  మద్యనిషేధం అమలులో ఉండగా ఇంటికి తాగివచ్చిన భర్తను , పోలీసులుకు పట్టిచ్చింది ఓ భార్య.. బీహార్ లో ప్రస్తుతం మద్యనిషేధం అమలులో ఉంది.. ఔరంగాబాద్ జిల్లాలో నీంటోలా అనే గ్రామంలో సుమనదేవి , తన భర్త పవన్ చౌదరి తాగి ఇంటికొచ్చాడని పోలీసులకు ఫోన్ చేసింది. తాగిన మైకంలో తనను పక్కలోకి రమ్మంటున్నాడని కూడా ఫిర్యాదు చేసింది.. ఇటీవల కాలంలో స్నేహితులతో కలిసి తాగుతున్నాడని , అందువల్ల తన భర్తతోపాటు , అతడి స్నేహితులను కూడా అరెస్ట్ చెయ్యాలని కోరింది.. బీహార్ లో కల్తీ మద్యం తాగి , పదుల సంఖ్యలో చనిపోవడం , అంధులు కావడం జరుగుతుంది. అందువల్ల తన భర్తను , అతడి స్నేహితులను అరెస్ట్ చెయ్యాలని , మద్యం మానేవరకు జైల్లోనే పెట్టండని కోరింది. నేరుగాఆమె స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు , పవన్ చౌదరిని అరెస్ట్ చేసి , రిమాండ్ కు తరలించారు.. తన భర్తను కాపాడుకోవడానికి ఇంతకంటే మార్గంలేదని సుమనదేవి చెప్పింది.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.