రోడ్డు మీద అందమైన అమ్మాయి కనిపించి, లిఫ్ట్ అడిగితే… అందులోనూ అర్ధరాత్రి వేళ్ళ సాయం చేయమని కోరితే… కాస్త జాగ్రత్త. ఆ అమ్మాయి వెనకాల పెద్ద ముఠానే ఉంటుంది. అమ్మాయి అందం చూసి లిఫ్ట్ ఇచ్చారంటే, మీ పని అయిపోయినట్టే. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఇటీవలకాలంలో ఎక్కువైపోయాయి. తాజాగా ఢిల్లీలో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ.
ఓ కాల్ ట్యాక్సీలో ప్యాసెంజర్ ను తీసుకుని క్యాబ్ డ్రైవర్ వెళుతున్నాడు. అర్ధరాత్రి వేళ ఓ అమ్మాయి కారు అడ్డగించి తనను ద్వారక వరకు డ్రాప్ చేయాలని కోరింది. అయితే ఢిల్లీకి ఎందుకొచ్చావంటూ ఆ డ్రైవర్, ప్యాసింజర్ అడిగారు. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వచ్చానని, తమ మధ్య గొడవ జరిగిందని, అతను అలిగి వెళ్ళిపోయాడని, తనకు చాలా భయంగా ఉందని, రాత్రి కూడా అయిందని, కొంచెం సాయం చేయాలని కోరింది. అయితే వారు ఇలా మాట్లాడుతుండగానే కొంతమంది వ్యక్తులు కోడిగుడ్లు తీసుకుని కారు గ్లాస్ పై కొట్టారు. కర్రలు, రాడ్లు తీసుకుని వచ్చేశారు. కారు డోర్లు తీయాలని బెదిరించారు. అయితే భయపడిపోయిన డ్రైవర్ కారును ముందుకు పోనిచ్చారు. ఈ వీడియో అంతా కారులో వెనక కూర్చున్న ప్యాసింజర్ రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఇలాంటి దారుణాలు కూడా జరుగుతున్నాయి. సో బీ కేర్ ఫుల్.
Delhi, it's so scary. pic.twitter.com/04Lxnk5MdP
— ? rundhati 2.0 | ਕਿਸਾਨਾਂ ਦੇ ਨਾਲ (@Polytikles) November 14, 2021