ఆమె అంతే .. భర్తను మళ్ళీ మోసం చేసింది..

  0
  8205

  దారి త‌ప్పిన ఆడ‌ది ఎలా ఉంటుందో.. ఓ కోటీశ్వ‌రుడైన పారిశ్రామికవేత్త భార్య సోనియాగాంధీ నిద‌ర్శ‌నం. కోట్ల రూపాయ‌ల ఆస్తులున్న క‌న్యాకుమారి జిల్లా కొడంకుళంకు చెందిన మోహ‌న్ రాజా భార్య పేరు సోనియాగాంధీ. వారికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. ప‌క్క‌దారి ప‌ట్టిన సోనియా, నాలుగు నెల‌ల క్రితం త‌న కూతురుని తీసుకుని ప్రియుడితో వెళ్ళిపోయింది. పోతూపోతూ ఇంట్లో ఉన్న 13 ల‌క్ష‌ల రూపాయ‌ల న‌గ‌దు, 45 స‌వ‌ర్ల బంగారం తీసుకెళ్ళింది. పోలీసులు గాలింపు చేసి రెండున్న‌ర నెల‌ల త‌ర్వాత ఆమె త‌న ప్రియుడు మ‌నోజ్ తో తిరుచునాప‌ల్లిలో ఉండ‌గా ప‌ట్టుకుని తీసుకొచ్చారు. కోర్టులో హాజ‌రుప‌రిచారు. త‌న భ‌ర్త‌తో క‌లిసి ఉంటాన‌ని సోనియా కోర్టులో చెప్పింది.

  ఇది జ‌రిగి ప‌ది రోజులు కూడా కాలేదు. మ‌ళ్ళీ స్కూల్ కి వెళ్ళి పిల్ల‌ల‌ను తీసుకొస్తాన‌ని భ‌ర్త‌కి చెప్పి బ‌య‌ట‌కి వెళ్ళింది. మ‌ళ్ళీ ప్రియుడు మ‌నోజ్ తో క‌లిసి లేచిపోయింది. ఈ ద‌ఫా ప‌ది ల‌క్ష‌ల న‌గ‌దు, 12 స‌వ‌ర్ల న‌గ‌లు తీసుకుని పోయింది. భ‌ర్త మోహ‌న్ రాజా మ‌ళ్ళీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్నిసార్లు ప్రియుడితో వెళ్ళిపోయిన భార్య ఎందుక‌ని పోలీసులు ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా, ఈ అమాయ‌క‌పు భ‌ర్త మాత్రం త‌న‌కు భార్య కావాలంటూ ప‌ట్టుబ‌ట్టాడు.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.