భర్తను చంపించింది జయసుధ..నమ్మలేని నిజం.

  0
  1213

  నువ్వంటే నాకిష్టం, నిన్ను వదిలి ఉండలేను , నాభర్తను చంపేస్తే ఇద్దరం సుఖంగా ఉందామంటూ , ఓ వివాహిత , ప్రియుణ్ణి ప్రోత్సహించి భర్తను ఘోరంగా చంపించింది.. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకరంపల్లిలో పండ్ల వ్యాపారి శంకరయ్య హత్యకేసును పోలీసులు ఛేదించారు. అతడి భార్య జయసుధ ఈ హత్యలో కీలక పాత్రధారి.. సూత్రధారి అని పోలీసులు చెప్పారు. శంకరయ్య , జయసుధకు పండ్ల దుకాణం ఉంది. శంకరయ్య అక్కడే , ఒక దానిమ్మ తోట లీజుకు తీసుకున్నాడు. వారానికోసారి తోటకువెళ్లి వచ్చేవాడు.

  ఈ నేపథ్యంలో దుకాణంలో భార్య జయసుధకు , సమీపంలోని జిమ్ ట్రైనర్ తిరుపతిరావుతో పరిచయం ఏర్పడింది. అదికాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో జయసుధ , తన భర్తతో సంసారం చేయడం తనకు ఇష్టంలేదని అందువల్ల , భర్తను చంపేస్తే , ఇద్దరం సుఖంగా ఉందామని రెచ్చగొట్టింది. జయసుధకు 40 ఏళ్ళు వయసు కాగా , జిమ్ ట్రెయినర్ తిరుపతయ్యకి 23 ఏళ్లు.. ఈ నెల 11న , శంకరయ్య తోటకు పోయి తిరిగి వస్తుండగా , తిరుపతయ్య అతడిని తలపై కర్రతో కొట్టి , కత్తితో గొంతుకోసి చంపేశాడు. పోలీసులు కేసు దర్యాప్తులో తిరుపతయ్య నేరం , దీనివెనుక భార్య కుట్ర బయటపడటంతో పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు..

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.