భార్యను చదివించి విదేశాలకు పంపిస్తే..

    0
    2942

    భార్యను ఉన్నత చదువులు చదివించాలని కొత్తగా పెళ్లయిన ఓ భర్త కలలు కన్నాడు. భార్య కూడా తనను విదేశాలకు పంపిస్తే బాగా చదువుకొని ఎక్కువ డబ్బులు సంపాదిస్తానంటూ భర్తకు కళ్లముందే కలర్ మూవీ చూపించింది. పాపం భార్య వ్యామోహంలో ఉన్న భర్త 21 లక్షలు అప్పు చేసి, ఆమెను ఉన్నత చదువులకోసం న్యూజిలాండ్ పంపించాడు. ఎయిర్ పోర్ట్ లో దిగిన వెంటనే ఫోన్ స్విచాఫ్ చేసింది.

    అక్కడ ఇంతకు ముందే తనతో పరిచయం ఉన్న ప్రియుడితో సహజీవనం చేస్తోంది. ఎన్నారై భర్తల మోసాలే కాదు, ఎన్నారై పెళ్లాల మోసాలు కూడా ఇలాగే ఉన్నాయి. పంజాబ్ లోని భటిండా జిల్లా మాదీలో మణిదీప్ సింగ్ అనే యువకుడు కన్వర్ దేవేందర్ కౌర్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అత్తమామలు కూడా అల్లుడికి నచ్చజెప్పి అమ్మాయిని ఉన్నత చదువులు చదివించాలని కోరారు. పాపం అల్లుడి వారి మాటలు నమ్మి, డబ్బులు కట్టి మరీ విదేశాలకు పంపించాడు.

    ఇప్పుడు తన భార్య ఎయిర్ పోర్ట్ లో దిగుతూనే ఫోన్ స్విచాఫ్ చేసేసిందని, అక్కడ మరో వ్యక్తితో సహజీవనం చేస్తూ చదువుకుంటోందని వాపోతున్నాడు. ఆమె ఇదివరకే ఎడ్యుకేషన్ వీసా మీద న్యూజిలాండ్ వెళ్లి వచ్చింది. ముందుగా భార్యను పంపించిన తర్వాత తనను కూడా పిలిపించుకుంటానని భార్య చెప్పడంతో పాపం విదేశీ కలల్లో ఉన్న భర్త, అప్పు చేసి మరీ భార్యను న్యూజిలాండ్ పంపించారు. ఇప్పుడు నెత్తీనోరు బాదుకుని తనను భార్య మోసం చేసి, అప్పులపాలు చేసి వెళ్లిపోయిందని ఆేదన వ్యక్తం చేస్తున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    ఇవీ చదవండి..

    మాజీ సిఎం భార్య చెల్లెలు, ఫుట్ పాత్ పై యాచన.

    25 సార్లు లేచిపోయింది.. అయినా క్షమించిన భర్త .

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్