కోడితో ప్రేమలో పడిన ఎమ్మెల్యే కొడుకు.. చివరకు ఏమైందంటే..?

    0
    451

    తమ ఇంటిలో కోడి చనిపోయిందని ఓ మాజీ ఎమ్మెల్యే కొడుకు పోలీస్ కేసు పెట్టాడు. పెట్టడమే కాదు, పట్టుబట్టి ఆ కోడి ఎందుకు చచ్చిపోయిందో పోస్ట్ మార్టమ్ చేయించాలని డిమాండ్ చేశాడు. రాజకీయ నాయకుడు కాబట్టి, తండ్రి పలుకుబడితో కోడికి పోస్ట్ మార్టమ్ కూడా చేయించాడు. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ విచిత్ర సంఘటన ఉత్తర ప్రదేశ్ మహారాజ్ గంజ్ జిల్లా సింధూరియాలో జరిగింది. మాజీ ఎమ్మెల్యే దుక్కి ప్రసాద్ కొడుకు రాజ్ కుమార్ భారతి ఈ ఫిర్యాదు చేశాడు. తన కొడుకు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి కోడి కిందపడిపోయి ఆయాసంతో ఉందని, అటు ఇటు కొట్టుకుని ఊపిరాడక చనిపోయిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అందువల్ల తన కోడిపై విషప్రయోగం జరిగిందన్న అనుమానం ఉందని దీనికి కారణం ఎవరో తేల్చాలని చెప్పారు. సింధూరియా పోలీసులు ఇప్పుడు ఈ కోడి హత్య కేసుని ఛేదించే పనిలోనే ఉన్నారు.

    ఇవీ చదవండి..

    మాజీ సిఎం భార్య చెల్లెలు, ఫుట్ పాత్ పై యాచన.

    25 సార్లు లేచిపోయింది.. అయినా క్షమించిన భర్త .

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్