ప్రకాశంజిల్లా సింగరాయకొండ మండలం దేవళం పల్లెపాలెంలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను చంపబోయింది ఒక దుర్మార్గురాలు. స్ధానికంగా నివాసముండే కొక్కిలిగడ్డ సుబ్బారావు, వెంకటేశ్వరమ్మకు 13 ఏళ్ళ క్రితం వివాహమైంది.వీరికి ఇద్దరు మగ సంతానం. అయితే కూలీ పనుల నిమిత్తం దంపతులు ఇద్దరు హైదరాబాద్ వెల్తుంటారు. ఈ నేపధ్యంలోనే వెంకటేశ్వరమ్మకు గంటా సతీష్ అనే వ్యక్తి పరిచియం అయ్యాడు. కొంతకాలం తర్వాత పరిచయం కాస్తా ఇద్దరి మద్య అక్రమ సంబంధంగా మారింది. విషయం తెలుసుకున్న సుబ్బారావు భార్యను హెచ్చరించాడు.
రెండు నెలలక్రితం హైదరాబాద్ నుంచి ఊరికి వచ్చేసాడు. ఆమెకు , ప్రియుడిని కలుసుకునే అవకాశం రాలేదు. దీంతో ఎలాగైన భర్తను అడ్డు తొలగించాలనుకున్న వెంకటేశ్వరమ్మ ప్రియుడితో కలిసి మర్డర్ ప్లాన్ చేసింది. అతడిని తమ ఊరికి రమ్మని చెప్పి పిలిపించింది. నిన్న రాత్రి 12 గంటల సమయంలో సుబ్బారావు నిద్రలో ఉండగా ప్రియుడు సతీష్ తో కలిసి సుబ్బారావు మెడకు తాడు కట్టి చంపే ప్రయత్నం చేసారు. అయితే వారి నుండి తప్పించుకున్న భర్త సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలిసులు వారి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులు చీరాల రైల్వే స్టేషన్లో టైన్ ఎక్కారని తెలుకుని అరెస్ట్ చేసారు. నిందితులు ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
ఇవీ చదవండి..