ఒంటరిగా ఉన్న సినీ నటిని కత్తులతో బెదిరించి..

  0
  378

  ప్ర‌ముఖ మోడ‌ల్, సినీ న‌టి అలంకృత స‌హాయ్ నివాసంలో దొంగ‌లు దోపిడీకి తెగ‌బ‌డ్డారు. ఆమె ఇంట్లోకి చొర‌బ‌డిన దుండ‌గులు ఆమెను క‌త్తుల‌తో బెదిరించి వాష్ రూమ్‌లో తీసుకెళ్ళి బంధించారు. ఆ త‌ర్వాత ఇంట్లో ఉన్న 6 ల‌క్ష‌ల రూపాయ‌ల న‌గ‌దు దోచుకున్నారు

  ఆపై ఆమె ఏటీఎం కార్డు తీసుకుని, పిన్ నెంబ‌ర్ అడిగి తెలుసుకున్నారు. తరువాత ఒక నిందితుడు సమీపంలోని ఏటీఎం సెంటర్‌కు వెళ్లి ఆమె ఖాతా నుండి 50 వేలు డ్రా చేసాడు. ఆ త‌ర్వాత మిగిలిన ఇద్ద‌రికీ ఫోన్ చేసి ప‌ని అయిపోయింది రండి అంటూ చెప్ప‌గానే, వారిద్ద‌రూ అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు.

  వారు అక్క‌డి నుంచి వెళ్ళిపోయిన త‌ర్వాత అలంకృత ఎలాగోలా క‌ష్ట‌ప‌డి వాష్ రూమ్ త‌లుపులు బ‌ద్ద‌లు కొట్టుకుని బ‌య‌ట‌కు వ‌చ్చింది. నేరుగా పోలీస్ స్టేష‌న్ కి వెళ్ళి దొంగ‌త‌నం గురించి ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్