అమాయక భర్తను కిరాతకంగా చంపింది..

  0
  466

  భర్త తల నరికేసి ఇంటిగుమ్మానికి వేలాడదీసింది ఓ భార్య.. ఇదేదో హర్రర్ సినిమాలో సీన్ కాదు.. నిజంగా జరిగిందే.. మనదేశంలోనే .. ఎక్కడోకాదు , త్రిపుర రాష్ట్రంలో కోవై జిల్లా కేంద్రం ఇందిరకాలనీలో జరిగింది. భర్త వయసు 50 ఏళ్ళు, భార్యకు 40 ఏళ్ళు.. భర్త నిద్రపోతుండగా , రాత్రి రెండు గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. భార్యపేరు సావిత్రి తంతి, భర్తపేరు రవీంద్ర తంతి. భర్తను చంపేసి , తలతీసి , గుమ్మానికి కట్టిన తరువాత రాత్రంతా , ఆమె భర్త శవం పక్కనే కూర్చుండిపోయింది.

  హత్య జరిగిన సమయంలో ఇంట్లో , ఆమె పిల్లలు , సోదరుడు నిద్ర పోతున్నారు. లేచిచూసిన తరువాత , పెద్దకొడుకు , భయపడి బయటకు వెళ్లి , పోలీసులకు తల్లిచేసిన ఘోరం గురించి ఫిర్యాదు చేసాడు. ఇటీవల కొంతకాలంగా తల్లి మానసికంగా బాధపడుతొందని కొడుకు చెప్పాడు. తన తండ్రి చాలా మంచివాడని చెప్పాడు. తల్లికి ఒక మాంత్రికుడి వద్ద , పూజలు చేయిస్తున్నామని చెప్పాడు. తల్లి , శాకాహారి అయినా , గత రాత్రే , తనకు చికెన్ కావాలని తెప్పించుకొని తిన్నదని చెప్పాడు. ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు..

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..