కసాపురంలో కొత్త బులెట్ పూజలో ఎందుకు కాలిపోయింది..??

  0
  1610

  బులెట్ బైక్ కాలిపోయింది.. పాతదికాదు , కొత్త బైక్ ..పూజకు తెస్తే కాలిపోయింది.. ఇప్పటివరకు ఈ స్కూటర్ లే కాలిపోతున్న పరిస్థితుల్లో , ఇండియా కింగ్ , రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ బులెట్ , పూజకోసం తెస్తే కాలిపోయింది., ఇదిప్పుడు దేశవ్యాప్తంగా చర్చనియాంశం అయింది. ఈ స్కూటీలలో థెర్మో సిస్టం , లేదా బ్యాటరీ లో సమస్యలవల్ల అవి కాలిపోతున్నాయని సందేహాలున్నాయి. మరిప్పుడు , కొత్త బులెట్ బైక్ , పూజకు తెస్తే ఎందుకు తగలబడిందన్నది సమస్య.. దీన్ని కంపెనీ సీరియస్ గానే తీసుకుంటుంది. ఎందుకంటే వందేళ్లకు పైబడ్డ చరిత్ర ఉన్న బుల్లెట్ బైక్ ఇప్పుడు మంటల్లో మండి చర్చనీయాంశం అయింది. బైక్ కొన్న తరువాత , దానిలో స్వంతంగా మార్పులు చేయడంవల్ల , బైక్ తగలబడే అవకాశం ఉందని ఆటోమొబైల్ ఇంజినీర్లు చెబుతుంటారు. 90 శాతం ప్రమాదాలకు ఇవే కారణమని అంటారు.

  అనంతపురం జిల్లాలో క్రొత్త బుల్లెట్ బండి మంటల్లోకాలిన నేపధ్యం ఇలా ఉంది. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరుకు చెందిన రవిచంద్ర, ఉగాది సందర్భంగా నెట్టికంటి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి తన బుల్లెట్ బైక్ పై మైసూర్ నుంచి కసాపురం వచ్చాడు. తన నూతన బులెట్ వాహనానికి పూజ చేయిస్తున్న సమయంలో ఎండ తీవ్రతకు ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో భక్తులు భయాందోళన చెందారు. ఘటనలో బుల్లెట్ బండి పూర్తిగా దగ్ధం అయిపోయింది.

  చూస్తుండగానే పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో జనం భయంతో పరుగులు తీశారు. బుల్లెట్ బైక్ ట్యాంక్ పెద్ద శబ్ధంతో పేలపోవడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఎండ వేడిమికి మంటలు వచ్చాయా లేక ఏదైనా సాంకేతిక లోపమా అనేది తెలియాల్సి ఉంది. గుడి బయట వాహనాన్ని నిలిపి ఉంచిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే స్థానికులు అప్రమత్తమై బైక్ పై నీళ్లు చల్లి, మంటలు ఆర్పివేశారు. పక్క బైకులకు మంటలు వ్యాపించకుండా చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

  https://www.facebook.com/Nelloredigitalnetwork/videos/1127400044773179

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.