అర్ధరాత్రి ఆకాశంలో అద్భుతం.. భారీస్థాయిలో ఉల్కాపాతం..

    0
    149

    అర్ధరాత్రి ఆకాశంలో అద్భుతం జరిగింది.. మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా నగరాల్లో ఆకాశవీధిలో గత రాత్రి మిరుమిట్లుగొలిపే దృశ్యాలు కనువిందు చేశాయి.. ఆకాశంలో పెద్ద అగ్నిగోళాలు దిగుతున్నట్టు, రాకెట్ లా దూసుకుపోతున్నట్టు కనిపించాయి . మరికొన్ని చోట్ల విమానం లాగా మంటలు దూసుకుపోతూ ఆశ్చర్యచకితులను చేశాయి. నాగపూర్ , జబువా , బర్వాని , బేతుల్ , ధార్ ఇలాంటి చోట్ల
    ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయి .

    ఈ విషయమై ఉజ్జయినిలోని శివాజీ అబ్జర్వేటరీ అబ్జర్వేటరీ డైరెక్టర్ రాజేంద్ర గుప్తా మాట్లాడుతూ ఈ దృశ్యాలన్నీఉల్కా పాతానికి సంబంధించినవని అని చెప్పారు . ఆకాశం నుంచి ఉల్కా పాతం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అయితే అప్పుడప్పుడు ఇలా పెద్ద ఎత్తున ఉల్కలు రాలడం జరుగుతుందని అన్నారు. దాదాపు 35 ఏళ్ల క్రితం ఇంత భారీ స్థాయిలో ఉల్కా పాతాన్ని గమనించామని ఆయన అన్నారు.

    రాత్రుళ్ళు ఉల్కలు ఆకాశం నుంచి కిందికి దిగుతున్న సమయంలో కొన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో భూవాతావరణంలోకి వచ్చిన తర్వాత ఆ రాపిడికి మండి బూడిద అయిపోతాయి అని అన్నారు . అయితే , మహారాష్ట్ర , మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన ఈ ఉల్కాపాతం అందరినీ ,ఆశ్చర్యానికి , భయాందోళనకు గురి చేసింది . అయితే వెంటనే మీడియా ద్వారా భయపడాల్సిన అవసరం లేదని సంబంధిత అధికారులు వివరణ ఇచ్చారు..

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.