హీరోయిన్ మలైకా అరోరాకు ప్రమాదం..

  0
  241

  ప్రముఖ హిందీ నటి , హీరోయిన్ మలైకా అరోరాకు ప్రమాదం జరిగింది. ముంబై , పూనా రోడ్ లో మలైకా కారు మరో మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొని ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మలైకా అరోరా గాయపడింది. మలైకా అరోరా ని ముంబైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆమెకు ప్రమాదం లేదని గాయాలు స్వల్పమైన వని డాక్టర్లు చెప్పారు .

  ఆమె ఒక ఈవెంట్లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఫోటో షూట్ ,ఫ్యాషన్ షో కి సంబంధించిన ఈవెంట్ లో మలైకా అరోరా పాల్గొంది . మలైకా అరోరా సల్మాన్ ఖాన్ సోదరుడుని మొదటి పెళ్లి చేసుకుంది . వారిద్దరికీ ఒక బిడ్డ కూడా ఉన్నాడు . ఆ తర్వాత తన కంటే చిన్నవాడైన అర్జున్ కపూర్ ను మలైకా ప్రేమించింది.

  పెళ్లి చేసుకోక పోయినా ఇప్పుడు వీళ్లిద్దరు సహజీవనం చేస్తున్నారు. అతడు ఆమె కంటే దాదాపు పదహారేళ్లు చిన్నవాడు . వీరిద్దరి సంబంధంపై అర్జున్ కపూర్ ఒక సందర్భంలో ఆమె కంటే తనకు అందమైన ఆనందమైన మనిషి ఈ ప్రపంచంలో కనబడదని చెబుతుంటాడు..

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.