బాహుబలి – 2 రికార్డ్ RRR ఇలా బద్దలు కొట్టింది…

  0
  502

  బాహుబలి సినిమా రికార్డులను త్రిబుల్ ఆర్ బద్దలుకొట్టింది. బాహుబలి సినిమాని బీట్ చేసే సినిమా మరి కొన్ని సంవత్సరాల పాటు రాదన్న సినీ విమర్శకులు ,సినీ పరిశీలకుల అంచనా త్రిబుల్ ఆర్ తలకిందులు చేసింది . మొదటి రోజు కలెక్షన్ లలోనే బాహుబలి2 రికార్డులను త్రిబుల్ ఆర్ బద్దలు కొట్టింది . సినీ పరిశ్రమ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ అంచనా ప్రకారం మొదటి రోజే త్రిబుల్ ఆర్ సినిమా రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది.

  ఇది ఇంతవరకు భారతీయ సినిమాలులో ఒక రికార్డు. గతంలో ఏ సినిమా కూడా ఒకే రోజు రిలీజ్ అయిన అన్ని థియేటర్లలో 223 కోట్ల రూపాయల వ్యాపారం చేయలేదు. గతంలో బాహుబలి -2 , మొదటి రోజు 217 కోట్ల రూపాయలు సంపాదించింది. ఇప్పుడు దాన్ని బద్దలు కొట్టి త్రిబుల్ ఆర్ సినిమా 223 కోట్ల రూపాయలను సొంతం చేసుకుంది . రామ్ చరణ్ , ఎన్టీఆర్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తయారైన ఈ సినిమా భారత దేశం లోనేకాకుండా ప్రపంచంలోని అనేక దేశాలలో విడుదలైంది.

  ఈ సందర్భంగా సంబరాలు ఆకాశాన్నంటాయి. మొదటిరోజు సినీ విశ్లేషకులు ,పరిశీలకులు ,విమర్శకులు ప్రశంసలను త్రిబుల్ ఆర్ సినిమా సంపాదించుకుంది . ఒక సినిమాలో ఇద్దరు క్రేజీ హీరోలు ఉంటే సినిమాను బ్యాలెన్స్ చేయడం కష్టమే.. సినీ విమర్శకుల అభిప్రాయం కూడా ఇదే. గతంలో కూడా ఇద్దరు హీరోలు కలిసి పనిచేసిన సినిమాలు అంతగా సక్సెస్ అయ్యేవి కావు , అయితే RRR విషయంలో ఆ అభిప్రాయాలు తప్పుఅనితేలిపోయింది..

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..