కేర‌ళ‌లో టొమేటో ప్లూ క‌ల‌క‌లం..

  0
  186

  కేర‌ళ‌లో టొమేటో ప్లూ క‌ల‌క‌లం రేపుతోంది. ఇదేదో టొమేటోల‌కు వ‌చ్చే వ్యాధి కాదు. చిన్న‌పిల్ల‌ల‌కు వ‌చ్చే వింత వ్యాధి. ఇప్ప‌టివ‌ర‌కు కేర‌ళ‌లో 80 మంది టొమేటో ఫ్లూ బారిన ప‌డ్డారు. అరుదైన వైర‌స్ కార‌ణంగా వ‌స్తోన్న టొమేటో ఫ్లూ ఐదేళ్ళ‌లోపు పిల్ల‌ల‌కే సంక్ర‌మించింది. అన‌ధికార లెక్క‌ల ప్ర‌కారం ఈ వ్యాధి ఇంకా ఎక్కువ మందికే సోకి ఉండ‌వ‌చ్చ‌ని అధికారులే చెబుతున్నారు. ఈ వ్యాధి స‌రిహ‌ద్దు రాష్ట్ర‌మైన త‌మిళ‌నాడుకు పాక‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. కేర‌ళ నుంచి కోయంబ‌త్తూరుకు వ‌చ్చే పిల్ల‌ల‌తో టొమేటో ఫ్లూ ప‌రీక్ష‌లు చేస్తున్నారు.

  పిల్ల‌ల‌కు జ్వ‌రం, ఒంటి మీద ద‌ద్దుర్లు, ఇత‌ర‌త్రా అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నాయేమోన‌ని కేర‌ళ‌, త‌మిళ‌నాడు స‌రిహ‌ద్దుల్లో వైద్య బృందాలు ప‌రిశీలిస్తున్నాయి. కేర‌ళ రాష్ట్రంలోని అన్ని అంగ‌న్ వాడీ కేంద్రాల్లో పిల్ల‌ల ఆరోగ్యాన్ని ప‌రీక్షించి టొమేటో ఫ్లూ ల‌క్ష‌ణాలు ఉన్నాయేమోన‌ని వైద్య బృందాల‌ను రంగంలోకి దించారు. గుర్తించ‌లేని ఒక ర‌క‌మైన జ్వ‌రం, ఒంటి మీద ద‌ద్దుర్లు, పొంగు లాంటి ల‌క్ష‌ణాలు, ఎరుపు రంగులో ఉండే నీటి బుడ‌గ‌లు ఈ వ్యాధి ల‌క్ష‌ణాలు. ఎరుపు రంగులో ఉండే నీటి బుడ‌గ‌ల కార‌ణంగానే దీనికి టొమోటో ఫ్లూ అనే పేరు పెట్టారు.

  కేర‌ళ‌లోని ఒక ప్రాంతానికే ప‌రిమిత‌మైన ఈ వ్యాధి.. ఇత‌ర ప్రాంతాల‌కు కూడా ప్ర‌బ‌లుతుందేమోన‌ని అనుమానం ఉంది. ఈ వ్యాధి సోకిన చిన్న‌పిల్ల‌ల‌కు సోకే ల‌క్ష‌ణాల‌ను వైద్యులు ఈ విధంగా వ్య‌వ‌హ‌రించారు. ఒంటి మీద ద‌ద్దుర్లు, ఎర్ర నీటి బుడ‌గ‌లు, దుర‌ద‌, ఎక్కువ జ్వ‌రం, ఒళ్ళు నొప్పులు, జాయింట్ల వ‌ద్ద వాపులు, అల‌స‌ట‌, క‌డుపులో వికారం, వాంతులు, విరేచ‌నాలు, చేతులు మోకాళ్ళు న‌డుము రంగు మారుతున్న సంకేతాలు, జ‌లుబు, ద‌గ్గు ఈ ల‌క్ష‌ణాలు టొమేటో ఫ్లూ ల‌క్ష‌ణాలు.

  ఇవ‌న్నీ ఉన్నా కూడా అది టోమేటో ఫ్లూ అని పూర్తిగా అనుకోవ‌ద్ద‌ని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వ్యాధి కార‌ణంగా చ‌నిపోయినట్లు ఎక్క‌డా నిర్ధార‌ణ కాలేద‌ని, ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఇలాంటి స‌మ‌స్య‌లు ఉంటే వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించి చికిత్స తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.