ఏపీ , తెలంగాణాలో రాజ్యసభకు వీళ్లేనా ..?

  0
  375

  రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌ల న‌గారా మోగింది. 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ సీట్లకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎల‌క్ష‌న్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. త్వ‌ర‌లో ఖాళీ కానున్న రాజ్యసభ సీట్ల కోసం మే 24న నోటిఫికేషన్‌ విడుదల చేయ‌నుంది. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు మే 31వ తేదీగా నిర్ణయించింది. జూన్ 1న నామినేషన్లను పరిశీలిన‌, జూన్ 3న నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌. జూన్ 10న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్. అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడి. మొత్తం 57 సీట్లలో ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి నాలుగు సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. ఎంపీలు విజయసాయిరెడ్డి, సురేష్ ప్రభు, టీజీ వెంకటేష్, సుజనా చౌదరిల పదవీకాలం ముగియనుంది.

  ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మ‌ళ్ళీ కొన‌సాగే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. సురేష్ ప్ర‌భు, టీజీ వెంక‌టేష్‌, సుజ‌నాచౌద‌రి స్థానాల్లో మ‌రో ముగ్గురిని ఎన్నుకునే అవ‌కాశం వైసీపీకే ఉంది. ఈ ముగ్గురు ఎవ‌ర‌న్న‌దే ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌. వీరిలో అదానీ గ్రూప్ చైర్మ‌న్ గౌతం అదానీ భార్య ప్రీతి అదానీ, సినీ న‌టుడు ఆలీకి ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక కిల్లి కృపారాణి, నెల్లూరు జిల్లాకు చెందిన బీదా మ‌స్తాన్ రావులో ఎవ‌రో ఒక‌రికి అవ‌కాశం ద‌క్కనుంది. ఒక స్థానం బీసీకి ఇస్తార‌ని, దాని ప్ర‌కారం నెల్లూరు జిల్లాకు చెందిన బీదా మ‌స్తాన్ రావుకు ఉంటుంద‌ని స‌మాచారం. గ‌తంలో టీడీపీలో ఉన్న బీదా మ‌స్తాన్ రావు.. విజ‌య‌సాయిరెడ్డికి అత్యంత స‌న్నిహితుడు. ఆయ‌న ప్ర‌మేయంతోనే టీడీపీని వ‌దిలి వైసీపీలో చేరారు. మ‌స్తాన్ రావుకు ఇదివ‌ర‌కే రాజ్య‌సభ సీటు ఇస్తామ‌ని హామీ ఇచ్చిన‌ట్లు కూడా చెబుతున్నారు.

  తెలంగాణ నుంచి ప‌ది మంది రేసులో ఉన్నారు. తెలంగాణ నుంచి కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, ధర్మపురి శ్రీనివాస్‌లు రిటైర్‌ అవుతున్నారు. దీంతో మూడు రాజ్య‌స‌భ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ స్థానాల కోసం బండ ప్ర‌కాష్‌, వినోద్ కుమార్, మాజీమంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు, పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి, ఎంఏ స‌లీమ్‌, మాజీమంత్రి మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు పోటీలో ఉన్నారు. మ‌రి వీరిలో ఎవ‌రికి స్థానం ద‌క్కుతుందో చూడాలి.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.