ఈ శాటిలైట్ ఫొటోలో కనిపించేదేమిటో తెలుసా.. ?

    0
    2374

    వ‌ల‌స పక్షులు సముద్రాలు దాటుకుని సుదూర ప్రాంతాలకు ఎలా వలస పోతాయి? ఎందుకు వలస వెళ్తాయి? దారి ఎలా తెలుస్తుంది? వీటికి నావిగేష‌న్ ఎలా తెలుస్తుంది ? దీని వెనుక ఉన్న ర‌హ‌స్యం ఏంటి? అనే సందేహాలు అంద‌రికీ ఉంటాయి. కానీ కొంద‌రికే వాటి గురించి తెలుసు.


    ప్ర‌ధానంగా ఆహారం కోసం, వాతావరణ ప్రతికూలతల నుంచి కాపాడుకునేందుకు, సంతానోత్పత్తి కోసం ప‌క్షులు వ‌ల‌స‌పోతుంటాయి. స‌ముద్రాలు, ఖండాలు దాటి వందల, కిలోమీటర్ల దూరం వ‌ల‌స పోతుంటాయి. అలాంటివాటిల్లో ఫ్లెమింగో ప‌క్షులు కూడా ఒక‌టి. మనుషులు అయస్కాంత దిక్సూచితో ఉత్తర, దక్షిణాలను గుర్తించడం మనకు తెలిసిందే. అయితే, పక్షుల్లో అలాంటి అయస్కాంత దిక్సూచి అంతర్గతంగా ఇమిడి ఉంటుంది.

    పక్షుల కంటిలోని ఒక రసాయనం అయస్కాంతానికి స్పందిస్తుండమే దీనికి కార‌ణం. అందువ‌ల్లే ఏ కంపాస్ లేకపోయినా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, అయస్కాంత క్షేత్రం ఆధారంగా ఇవి దారి తెలుసుకుంటాయి. వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌కు ఎదురేగుతూ సుదూర ప్రాంతాల్లో ఉండే త‌మ గ‌మ్య స్థానాల‌కు అవి చేరుకోగ‌లుగుతాయి. పక్షులు ఒక క్రమ పద్దతిలో ఆకాశంలో ఎగురుతున్న సమయంలో చూడటానికి రెండు కళ్ళు చాలవు. నీలాకాశంలో ఎగురుతున్న ఫ్లెమింగో ప‌క్షుల బృందం ఏరియ‌ల్ ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కెన్యా దేశంలోని రిఫ్ట్ వ్యాలీ వ‌ద్ద‌ క్ర‌మ‌ప‌ద్ద‌తిలో, ఒకే వ‌రుస‌లో ప్ర‌యాణిస్తున్న ఈ ప‌క్షుల బృందాన్ని శాటిలైట్ కి చిక్కింది. బొగోరియా స‌ర‌స్సుకు ఫ్లెమింగో ప‌క్షులు వెళుతున్న దృశ్య‌మిది.

     

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.