రాత్రివేళ పార్కులో ఒంటరిగా హీరోయిన్, దొంగోడు ఏం చేశాడంటే..?

  0
  3502

  హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఓ సినీ నటిపై ఆగంతకుడు దాడి చేశాడు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో హీరోయిన్ చౌరాసియా కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా చౌరాసియా వద్దకు వచ్చిన ఆగంతకుడు, ఆమె మొబైల్ ఫోన్ ను లాక్కునే ప్రయత్నం చేశాడు. అయితే ఆమె ఇవ్వకపోవడంతో ఆగంతకుడు, ఆమెపై దాడికి పాల్పడ్డాడు. మొహంపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో కొద్దిసేపు పెనుగులాట అనంతరం ఆమెవద్ద నుంచి మొబైల్ లాక్కొని పారిపోయాడు. అయితే ఆమెపై దాడికి పాల్పడినది ఎవరనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. దొంగతనం చేయడానికే ఆమెపై దాడి చేశాడా.. లేక మరేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం చౌరాసియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.