మళ్ళీ ముంచుకొస్తోంది.. ముంచేస్తుందా..?

  0
  18606

  బంగాళాఖాతంలో ఏర్ప‌డిన బ‌ల‌మైన అల్ప‌పీడ‌నం ఇప్పుడు వాయుగుండంగా మారుతోంది. ఇది చెన్నైకి స‌మీపంలో తీరం దాట‌నుంద‌ని వాతావ‌ర‌ణ నివేదిక ప్ర‌క‌టించింది. దీని ఫ‌లితంగా త‌మిళ‌నాడు, ముఖ్యంగా చెన్నై .. మ‌న‌రాష్ట్రంలోని ద‌క్షిణ కోస్తా, రాయ‌ల‌సీమ జిల్లాల్లోనూ, విశాఖ‌లోనూ వ‌ర్షాలు కురుస్తాయ‌ని పేర్కొంది. వాయుగుండం తీరం దాటే స‌మ‌యంలో భారీవ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంది. ఇప్ప‌టికే వ‌ర్షాల‌తో అల్ల‌క‌ల్లోలం అయిన చెన్నైలో, వాతావ‌ర‌ణ శాఖ తాజా హెచ్చ‌రిక‌ల‌తో భ‌యాందోళ‌న నెల‌కొంది.

  18 వ తేదీ నుంచి 22 వ తేదీవరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే చెదురుమదురు వర్షాలు పడుతున్నా , 18 నుండి ఇవి ఎక్కువ కానున్నాయి. వాతావరణ నివేదిక ప్రకారం నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు పడతాయి. ప్రకాశం , కడప , అనంతపూర్ , చిత్తూరు , జిల్లాల్లో కూడా అధిక వర్షపాతం నమోదుఅవుతుంది. మిగిలిన జిల్లాల్లో చెదురు మదురుగా వర్షాలు పడతాయి.. అధికార యంత్రాంగంకూడా , అప్రమత్తమైంది.. దక్షిణ అండమాన్ లో ఏర్పడ్డ అల్పపీడనం , క్రమంగా ఉత్తర అండమాన్ సముద్రంలోకి మళ్లింది.. ఇదే ఇప్పుడు మరో ఉపద్రవానికి కారణం కాబోతుంది..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.