సినిమా వారసులపై అదిరిపోయే పంచ్ వేసిన నాని..

  0
  1537

  సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు వారసులు కచ్చితంగా ఏదో ఒక ఇన్ స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకుంటారు. నటన అనేది శిక్షణ తీసుకోవడం వల్ల వస్తుందా, లేదా సహజంగా వారిలో ఉండే టాలెంటా అనే విషయాన్ని పక్కనపెడితే.. వారసులంతా ఎక్కడో ఓ చోట ట్రైనింగ్ తీసుకునేవారే. కొంతమంది ఏకంగా విదేశాలకు సైతం వెళ్తుంటారు. ఇలాంటి వారందరిపై ఇన్ డైరెక్ట్ గా పంచ్ వేశాడు హీరో నాని.

  శ్యామ్ సింగ రాయ్ ట్రైలర్ లాంచ్ సందర్భంలో ఈ డైలాగ్ వేశాడు నాని. మీడియా, అభిమాను తో చిట్ చాట్ చేసే సమయంలో నాని సినీ వారసులపై సెటైర్ పేల్చాడు. తన నటన నేచురల్ గా ఉంటుందని ఓ అభిమాని పొగిడిన సందర్భంలో..
  నేను సినిమా స్కూళ్లకు వెళ్లలేదు, సినిమాలకు వెళ్లాను మీలాగే.. అని అన్నాడు. ఎవరిదో కొటేషన్ కోట్ చేస్తూ.. ఇలా అనుకోకుండా వారసులపై నాని పంచ్ వేశాడు.

  ఇక నాని నటించిన కొత్త సినిమా శ్యామ్ సింగ రాయ్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ తో ఓ ఎపిక్ లవ్ స్టోరీగా దీన్ని తెరకెక్కించామన్నారు నాని. చాలా కాలం తర్వాత థియేటర్స్ లోకి వస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పాడు.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.