కమండల గణపతి ఆలయంలో ఈ నీటి ధార ఎప్పటిది . ?

  0
  99

  సృష్టిలో ఎన్నో అద్భుతాలు. అందులో హైంద‌వ దేవాల‌యాల అద్భుత శిల్ప‌క‌ళా నైపుణ్యం అత్య‌ద్భుతం. ఆ శిల్ప సౌంద‌ర్యాన్ని ఎన్నిసార్లు తిల‌కించినా త‌నివి తీర‌నిది. అలాంటి అద్భుతమైన దేవాలయాల్లో ఒకటి… కమండల గణపతి ఆలయం. కర్ణాటక రాష్ట్రం చిక్క మంగళూరు జిల్లాలోని కొప్ప పట్టణానికి సుమారు 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అటవీ ప్రదేశంలో కమండల గణపతి ఆలయం ఉంది. ఈ ఆలయం వెయ్యేళ్ళ‌ క్రితం నాటిదని ప్రాశ‌స్త్యం. యోగముద్రలో కూర్చున్న‌ట్లు గ‌ణ‌ప‌తి విగ్ర‌హం ఇక్కడ ఉండ‌డం విశేషం.

  ఇక్కడ ఉన్న పుష్కరిణిని కమండల తీర్థం అని అంటారు. ఈ పుష్కరిణి కమండ‌లం ఆకారంలో ఉంటుంది కాబ‌ట్టి, ఈ పుష్క‌రిణికి ఆ పేరు వ‌చ్చింది. ఈ పుష్కరిణిలో ఏడాది పొడవునా నీటి ధార పెల్లుబుకు ఉంటుంది. వర్షాకాలంలో ఇక్కడి పుష్కరిణిలోని నీరు గణపతి పాదం వరకూ చేరుతాయని చెబుతారు. ఈ తీర్థంలో స్నానం చేస్తే శనిదోషం పరిసమాప్తం అవుతుందని, ఇక్కడ నీటిని సేవిస్తే ..అనేక రుగ్మతలు యాయమవుతాయని భక్తులు విశ్వాసం. ఇక్కడి నుండే బ్రహ్మ నది జన్మించి సుదూరంగా ప్రయాణించి తుంగానదిలో కలుస్తుంది.

  ఆలయ స్థల పురాణం ప్రకారం.. శని వక్రదృష్టి నుంచి త‌ప్పించుకునేందుకు పార్వతీదేవి ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు కోసం వ‌చ్చింద‌ట‌. స‌క‌ల గ‌ణ‌నాధుల‌కు అధిప‌తి అయిన వినాయ‌కుడిని ప్రార్ధించంతో … ఆయ‌న బ్రహ్మచారి రూపంలో ప్ర‌త్య‌క్ష‌య్యాడ‌ట‌. బ్రహ్మచారి రూపంలో కమండలం ధరించి కనిపించిన సృష్టించిన తీర్థాన్ని బ్రహ్మ తీర్థమనీ, కమండలం ధరించి దర్శనమిచ్చిన గణపతిని.. కమండల గణపతి అనే పేరు వచ్చిందని స్థల పురాణం. ఇక్కడే పార్వతీదేవి తపస్సు చేసిన ప్రదేశం కూడా దర్శనం చేసుకోవచ్చు.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్