చోరీకి గురైన పోలీస్ స్టేషన్ స్వాధీనం చేసుకున్న వస్తువులను అక్రమంగా అమ్మి ఓ మహిళా పోలీసు కోటీశ్వరురాలైంది. మహారాష్ట్ర పాల్గార్ జిల్లా వసాయ్ పోలీస్ స్టేషన్ లో మంగళ అనే లేడీ పోలీస్ కానిస్టేబుల్ రికవరి ప్రాపర్టీ ఇంచార్జిగా ఉంది. మోటార్ సైకిళ్ళు, మొబైల్ ఫోన్లు వంటివి రికవరీ చేయడం ఆమె డ్యూటీ. వాటిని కేసు విచారణ సమయంలో కోర్టుకి పెట్టాల్సి ఉంటుంది. అప్పటివరకు ఆమె కస్టడీలోనే ఆ వస్తువులు ఉంటాయి. కానీ ఇలా చోరికి గురైన వస్తువులను అప్పడప్పుడు ఆ లేడీ కానిస్టేబుల్ ఆ వస్తువులను దొంగచాటుగా అమ్ముతూ ఉండేది.
చివరికి కోర్టుకి సమర్పించాల్సిన సమయంలో ఆ వస్తువులు పోలీస్ స్టేషన్ నుంచే మాయం కావడం, వాటి స్థానంలో డూప్లికేట్ వస్తువులు పెట్టడం జరిగిపోతోంది. అయితే ఇటీవల ఓ పోలీస్ అధికారికి అనుమానం వచ్చి గత ఆరేళ్ళుగా చోరీ అయ్యి, రికవరీ అయిన వస్తువల డేటాను పరిశీలించారు. దాదాపు 26 లక్షల విలువ చేసే వస్తువులను ఆ కానిస్టేబుల్ అక్రమంగా అమ్మినట్లు గుర్తించారు. దీంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆమెను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.