నైట్ డ్యూటీలో సీఐకి కనిపించిన వస్తువులు ఇవే..

  0
  29468

  నైట్ డ్యూటీలో ఉన్న ఓ సీఐకి మంత్రించిన ఓ నాలుగు రోడ్ల కూడలిలో ఎర్ర గుడ్డలో నిమ్మకాయ, కోడిగుడ్డు, కొబ్బరికాయ కనిపించాయి. ఇంకేముంది మామూలుగా ఎవరైనా అవి ఉంటే దూరంగా వెళ్లిపోతారు. అక్కడినుంచి తీసి పక్కనపడేయడానికి కూడా ధైర్యం చేయరు. కానీ మన వరంగల్ సీఐ మామూలోడు కాదు. అక్కడే కూర్చుని ఆ గుడ్డను విప్పి ఒక్కో వస్తువు బయటకు తీశారు. కోడి గుడ్డుని ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి వాడుకుంటానని, నిమ్మకాయ జ్యూస్ తీసుకుని మధ్యాహ్నం తాగుతానని, ఇక కొబ్బరికాయను చట్నీకోసం వాడుకుంటానని చెప్పారు. ఇలాంటి మూఢ నమ్మకాలను అస్సలు పట్టించుకోవద్దని ఓ మెసేజ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.