వెంకటేశ్ బర్త్ డే స్పెషల్.. వీడియో అదిరింది..

  0
  393

  హీరో వెంకటేష్ త్వరలో ఎఫ్-3 సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇటీవల వెంకటేష్ నటించిన దృశ్యం-2 ఓటీటీలో సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఎఫ్-3 నేరుగా థియేటర్లలోకి వస్తోంది. వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి కొత్త వీడియో విడుదల చేశారు. ఎఫ్-3లో వెంకీ పాత్ర ఎంత ఫ‌న్ గా ఉండ‌బోతుందో శాంపిల్ చూపిస్తూ స్పెష‌ల్ బ‌ర్త్‌డే విషెస్ వీడియో మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

  ఛార్మినార్ లొకేష‌న్ ముందు లేత ఎరుపు రంగులో కాస్ట్యూమ్స్ వేసుకున్న వెంకీ న‌వాబు గెట‌ప్‌లో క‌నిపిస్తూ..చేతిలో నోట్ల‌ను విస‌ర‌క‌ర్ర‌లా వాడుకుంటున్నాడు. చాలా రోజుల తర్వాత వెంక‌టేశ్‌లోని ఫ‌న్ యాంగిల్‌ను మ‌రోసారి తెర‌పైకి చూపించ‌బోతున్నాడ‌ని తాజా వీడియో చూస్తే అర్థ‌మైపోతుంది. ఈ చిత్రంలో రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ముర‌ళీశ‌ర్మ‌, వెన్నెల కిశోర్‌, సునీల్‌, అన్న‌పూర్ణ‌మ్మ, ర‌ఘుబాబు, సోనాల్ చౌహాన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.