వివేకా హత్యపై నిజాల పేరుతో ఏమి జరుగుతొంది..?

    0
    313

    వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై పొలిటికల్ వార్ మొదలైంది. సీఎం జగన్ బాబాయ్ అయిన వైఎస్ వివేకానంద రెడ్డి అనూహ్య పరిస్థితుల్లో.. ఎన్నికలకు ముందు హత్యకు గురయ్యాడు. మొదట్లో అది గుండెపోటని భావించినా.. తర్వాత అది హత్యగా తేలింది. ఈ హత్యా ఘటనపై దర్యాప్తును ఎన్నికల అనంతరం సీఎం జగన్ సీబీఐ కి అప్పగించారు. అయితే ఇప్పుడు సీబీఐ విచారణలో ఇవి నిజాలు.. సాక్ష్యాలు అంటూ కొన్ని కధనాలు వెలుగులోకి వచ్చాయి.

    ఈ కథనాలన్నీ కూడా సీఎం జగన్ కు సన్నిహితంగా ఉండే ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన అనుచరుల చుట్టూ తిరుగుతున్నాయి. అగ్నికి ఆద్యం పోసినట్టు.. వివేకానంద కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి నేరుగానే వైసీపీ నాయకులపై ఆరోపణలు మొదలుపెట్టారు. ఈ ఆరోపణల్లో సీఎం జగన్, ఈ కేసు దర్యాప్తు విషయంలో సక్రమంగా వ్యవహరించలేదన్న వ్యాఖ్యలను కూడా జోడిస్తున్నారు. వైఎస్ వివేకా హత్య, దాని వెనుక నిజాలు అంటూ.. టీడీపీ.. దాని అనుకూల మీడియా ప్రచారంతో హోరెత్తిస్తోంది.

    వివేకా హత్య వ్యవహారంలోని నిజాల పేరుతో జరుగుతున్న ప్రచారం ముదిరి పాకాన పడుతుండటంతో తాజాగా వైసీపీ కూడా రంగంలోకి దిగింది. ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ అనుకూల మీడియా ఆడిస్తున్న డ్రామా అని ఖండిస్తోంది. ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా వార్తలు వస్తున్నాయని, సీబీఐ కూడా ఈ విషయంలో తొందరపడి, ఛార్జ్ షీట్ లీక్ చేస్తూ.. విచారణ సక్రమంగా చేయడం లేదన్న వాదనకు దిగింది.

    వివేకా కుమార్తె సునీత వెనుక టీడీపీ పాత్ర ఉందని కూడా చెప్పింది. రాబోయే ఎన్నికల్లో వారు పులివెందుల, కడప స్థానాలకు అభ్యర్థులు కాబోతున్నారని కూడా ఆరోపిస్తోంది. వివేకా హత్యలో ప్రచారం తమకు నష్టం కలిగేలా ఉండటంతో ఆలస్యంగా ఎదురుదాడికి దిగిన వైసీపీ, సున్నితమైన ఈ విషయాన్ని వివాదం చేయకూడదని ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నామని చెప్పింది. ఈ కేసు విచారణ సక్రమంగా జరగాలనే సీఎం సీఎం జగన్.. సీబీఐ కి ఈ కేసును అప్పగించారని చెబుతోంది.

     

    ఇవీ చదవండి… 

    బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

    మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

    నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

    తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..