సినీ నటుడు నరేష్ మళ్ళీ గొడవలో పడ్డాడు.. ఆయన భార్య రమ్య చీటర్ అని , అప్పులుచేసి ఎగవేసే మహిళ అని ఆరోపించారు. రమ్య నరేష్ ముగ్గురు భార్యల్లో ఒకరు.ఎనిమిదేళ్ల క్రితం పెళ్లయింది. ఆమె వ్యహారాలు తెలిసే , తాను ఆమెను దూరంపెట్టానని చెప్పాడు. ఆమె వ్యహారాలు తెలిసే , ఇద్దరం వేర్వేరుగా ఉంటున్నామని తెలిపారు. ఈమె విషయాలు తెలిసే , మూడు నెలల క్రితం పత్రికలలో ప్రకటన కూడా ఇచ్చానని అన్నారు. అయినా ,ఆమె , తమ ఇంట్లోనే ఉన్నపటికీ ఇద్దరం విడివిడిగా ఉన్నామన్నారు.
మాజీమంత్రి రఘువీరారెడ్డి తమ్ముడి కూతురుఅయిన రమ్యపై , ఇప్పుడు హైదరాబాదులో చీటింగ్ కేసు నమోదు అయింది. రమ్య మోసపు మాటలు చెప్పి , హైదరాబాద్ లో లక్షలు రూపాయలు వసూలుచేసి మోసంచేసిందని అన్నారు. గతకొన్ని రోజులుగా , ఆమెకోసం ఇంటికి రాత్రిళ్ళు కార్లలో వచ్చిపోతుంటారని , దీనితో అనుమానం వచ్చి , ఆమెను హెచ్చరించానని చెప్పారు. అయినా మాటవినలేదని చెప్పారు.
పోలీసు స్టేషన్ నుంచి ఫోన్ వచ్చినతరువాత , తనకు సంబంధం లేదని పోలీసులకు చెప్పానని అన్నారు., అధిక వడ్డీలకు , అధిక లాభాలు ఇస్తానని , ఫ్లాట్స్ వ్యాపారం పేరుతో ఆమె చాలామందిని మోసంచేసిందని పోలీసులు కేసు నమోదు చేయడంతో తనకు , ఆమె వ్యవహారానికి సంబంధం లేదన్నారు..