గవర్నర్ కి , కేసీఆర్ కు మధ్య వార్ ముదిరిపోయింది.

    0
    242

    తెలంగాణ గవర్నర్ తమిళ సై కి , ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య వార్ ముదిరిపోయింది . గవర్నర్ పెత్తనాన్ని తాను సహించేది లేదంటూ ముఖ్యమంత్రి చెబుతుండగా , రాజ్యాంగ అధినేతగా తన విధులు నిర్వహిస్తారని గవర్నర్ చెబుతోంది . తాజాగా భద్రాచలం పర్యటనలో గవర్నర్ కార్యక్రమంలో కలెక్టర్ , ఎస్పీ ముఖం చాటేశారు. గవర్నర్ భద్రాచలం శ్రీరామ పట్టాభిషేకానికి వస్తున్నారని తెలుసుకుని కలెక్టర్, ఎస్పీ సెలవుపై వెళ్లిపోయారు .

    వారిద్దరూ ఆమె పర్యటనకు దూరంగా ఉండిపోయారు . భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి ప్రత్యేక రైల్లో వచ్చిన గవర్నర్ కు కిందిస్థాయి అధికారులు స్వాగతం చెప్పారు. ప్రజా ప్రతినిధులు కూడా ఎవరు రాలేదు . ఆమె పర్యటనలో ప్రజా ప్రతినిధులు గాని ఉన్నతాధికారులు గాని పాల్గొనలేదు . దీంతో భద్రాచలంలో జరిగిన శ్రీరామ పట్టాభిషేకం లో గవర్నర్ పాల్గొని తిరిగి స్థానిక కార్యక్రమాల్లో పాల్గొని వెళ్లిపోయారు .

    ఈ విషయమై మీడియా ప్రశ్నించగా తాను ఆధ్యాత్మిక పర్యటనకు వచ్చానని ఇవన్నీ పట్టించుకోనని చెప్పారు . ఎవరు వచ్చినా రాకపోయినా తన పని తాను చేసుకుంటూ ఉంటాననిస్పష్టం చేశారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని తాను భగవంతుని ప్రార్థించానని అని గవర్నర్ అన్నారు. శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమానికి హాజరు కావడం తన అదృష్టంగా భావిస్తున్నాను అని ఆమె చెప్పారు.

     

    ఇవీ చదవండి… 

    బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

    మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

    ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

    ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి..