గోవిందా ..? నీ దర్శనానికి ఇన్ని గొడవలా.. ??.

  0
  190

  తిరుమల ఆలయ దర్శనం నిత్యం ఏదో ఒక వివాదంలో పడుతోంది. కరోనా మహమ్మారి తర్వాత ఆలయ పాలకవర్గం దర్శనాల విషయంలో ఒక నిర్ధిష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో ,భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు . సమాచారంలోపం , సమన్వయలోపంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు . అలిపిరి వద్ద ,తిరుపతి లోని సర్వదర్శనం క్యూల వద్ద భక్తులు గొడవలు చేయడం సాధారణమైపోయింది. తమను పైకి అనుమతించాలని ధర్నాలు చేయడం, ఇలాంటి వాటితో ఇబ్బంది కలుగుతుంది. గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురుకాలేదు.

  కరోనా మహమ్మారి తరువాతకూడా పాత పద్దతిని పునరుద్దరించకపోవడంతో ఇబ్బంది కలుగుతుంది. తాజాగా తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్ల కోసం తిరుపతిలో భక్తుల తోపులాట జరిగింది . కొంత మంది గాయపడ్డారు . వేలాది మంది క్యూలో ఉండిపోయారు. గత రెండు రోజులుగా తిరుమల శ్రీవారి దర్శనం టోకెన్లు ఇవ్వకుండా ఈరోజు కౌంటర్ లు తెరిచారు. దీంతో శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు ఎగబడ్డారు. ఒక్కసారిగా భక్తుల సంఖ్య పెరగడంతో ఒక్కసారిగా టోకెన్ ల కోసం ఎగబడ్డారు . తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రాలు , శ్రీనివాసన్ భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్లు పంపిణీ చేస్తున్నారు . గోవిందరాజస్వామి సత్రాల వద్ద భక్తులు భారీగా రావడంతో తోపులాట జరిగింది. కొంత మంది భక్తులు గాయపడ్డారు

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి..