.టీవీఎస్ అదిరిపోయే బైక్.. లాంచింగ్ ఎప్పుడంటే..?

  0
  242

  రెట్రో స్టయిల్..300 ప్లస్ సీసీ ఇంజిన్..టీవీఎస్ అదిరిపోయే బైక్.. లాంచింగ్ ఎప్పుడంటే..?
  ==================================
  టీవీఎస్ కంపెనీ మరో బైక్ ను నూతనంగా లాంచ్ చేయనుంది. ఈ బైక్ జూలై 6వ తేదీన మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే టీవీఎస్ కంపెనీ దేశీయంగా మంచి పేరు తెచ్చుకుంది. సామాన్య, మధ్యతరగతి ఇళ్లలో మనకు ఈ కంపెనీ వాహనాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే తొలిసారిగా కంపెనీ సంపన్నవర్గాలను టార్గెట్ చేసింది. క్రూజర్ మోడల్ లో రెట్రో స్టైల్ తో ఈ బైక్ రూపుదిద్దుకున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో అక్కడక్కడా వస్తున్నా, అధికారికంగా మాత్రం ఇంకా లాంచ్ చేయలేదు.

  గత ఏడాది నుంచి ఈ బైక్ పై కంపెనీ ప్రతినిధులు వివిధ రకాలుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 300 ప్లస్ సీసీ బైక్స్ లో రాయల్ ఎన్ ఫీల్డ్, తాజాగా వచ్చిన హొండా హైనెస్, సీబీ 350 బైకులు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. వీటిలో లాంగ్ రైడ్స్ చాలా అనువుగా ఉంటాయి. అందుకోసమే వీటిని యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీవీఎస్ కూడా ఇలా 300 ప్లస్ సీసీ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. అయితే హొండా హైనెస్ లాగా మార్కెట్ ను షేక్ చేస్తుందా లేడా అనే విషయాలు మాత్రం బైక్ పూర్తి వివరాలు వచ్చాకే తెలిసే అవకాశం కనిపిస్తోంది.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..