వీరుడికి కేరళ పోలీస్ బాస్ వందనం..

  0
  1180

  కాసుల కోసం క‌క్కుర్తి ప‌డే పోలీసులు కొంద‌రైతే… క‌ర్త‌వ్యం కోసం ప్రాణాల‌కు తెగించే పోలీసులు కొంద‌రు మాత్ర‌మే ఉంటారు. వారిలో ఒక‌రే ఈ కేర‌ళ పోలీస్ అధికారి. వేటక‌త్తితో రౌడీ మీద‌కి దూకినా.. వెన‌క‌డుగు వేయ‌కుండా ఆ రౌడీని ఎదుర్కొన్నాడు. కింద‌ప‌డేసి, వాడి చేతిలోని వేట‌క‌త్తిని ప‌క్క‌కి లాగేసి, అదుపులోకి తీసుకొన్నాడు. పోలీస్ అంటే రియ‌ల్ హీరో అని ప్రూవ్ చేశాడు. వేట‌క‌త్తితో న‌రికేందుకు వ‌చ్చిన రౌడీని… ధైర్యంగా ఎదుర్కొన్న కేర‌ళ రాష్ట్రంలోని అళ‌ప్పుళ జిల్లా నూరానాద్ పోలీస్ స్టేష‌న్ ఎస్ఐ అరుణ్ కుమార్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

  ఆయ‌న ధైర్య సాహ‌సాల ప‌ట్ల‌ పోలీస్ శాఖ‌తో పాటు సామాన్య ప్ర‌జానీకం కూడా హ‌ర్షం వ్య‌క్తం చేసింది. ఆయ‌న‌ను కేర‌ళ పోలీస్ శాఖ అభినందిస్తూ క‌మెండేష‌న్ స‌ర్టిఫికెట్, ట్రోఫీని అంద‌చేశారు. త్వ‌ర‌లో ఆయ‌న‌కు ప్ర‌మోష‌న్ కూడా ఇవ్వ‌నున్నారు. ఎస్సై నుంచి సీఐకి ప్ర‌మోట్ చేయ‌నున్నారు.కేర‌ళ రాష్ట్రం అళప్పుళ జిల్లాలోని నూరానాద్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై అరుణ్ కుమార్ తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్ర‌మంలో పారా జంక్షన్ ప్రాంతంలో రోడ్డు పక్కన స్కూటీ పార్క్ చేసిన వ్యక్తి వద్ద పెట్రోలింగ్ వాహ‌నాన్ని ఆపారు.

  పార్కింగ్ విష‌యంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం జ‌రిగింది. ఈ క్ర‌మంలో పెట్రోలింగ్ జీపు మరికాస్త ముందుకు వచ్చి ఆపగా, ఆ స్కూటీపై ఉన్న వ్య‌క్తి.. వెంట‌నే త‌న వ‌ద్ద ఉన్న వేటకత్తి తీసి ఎస్సై అరుణ్ కుమార్ పై దాడి చేశాడు. అయినా బెద‌ర‌కుండా అతడిని పట్టుకునే ప్రయత్నం చేశారు ఎస్సై. ఈ క్రమంలో ఇద్దరూ కిందపడిపోయారు. చివరికి ఎస్సై అరుణ్ కుమార్.. ఆ వ్యక్తిని అదుపుచేసి, అత‌ని చేతిలో ఉన్న వేట‌కత్తిని లాగేసుకున్నారు. ఇంతలో స్థానికులు వచ్చి ఆ వ్యక్తికి దేహశుద్ధి చేశారు. అనంతరం ఆ వ్యక్తిని పోలీసులు తమ వాహనంలో ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో కేర‌ళ పోలీసులు పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్ అయింది.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..