కోహ్లీ ఎంత వ‌సూలు చేస్తాడో తెలుసా ?

    0
    97

    ఇన్ స్టాగ్రామ్ ద్వారా సంపాదిస్తున్న సెలెబ్రిటీల 2021 జాబితాను హెచ్‌ పర్‌ క్యూ సంస్థ విడుదల చేస్తుంటుంది. ఒక్క పోస్టుతో ఎవరెవరు ఎంత వెనకేసుకుంటున్నారో చెప్పే ఈ సర్వే కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈసారి లిస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందు వరుసలోకి వచ్చాడు. కోహ్లీ ఒక్క పోస్ట్ తో 6లక్షల 80వేల డాలర్లు సంపాదిస్తున్నాడు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.5.08 కోట్లు అన్నమాట.

    మొత్తం జాబితాలో కోహ్లీకి 19వ స్థానం దక్కింది. టాప్ 20లో నిలిచిన ఏకైక భారత సెలెబ్రిటీ కోహ్లీ ఒక్క‌డే కావ‌డం విశేషం. ఇక బాలీవుడ్ నుంచి హాలీవుడ్ చెక్కేసిన ప్రియాంక చోప్రా 27 స్థానంలో నిలిచింది. ఆమె ఇన్ స్టాలో ఒక్కో పోస్ట్ కు రూ.3 కోట్ల వరకు రాబడుతోంది. మొత్తం 395 మంది సెలెబ్రిటీలు ఉన్న ఈ లిస్టులో ఇద్దరు భారతీయులకే చోటు దక్కింది. ఇన్ స్టా ద్వారా అధికంగా సంపాదిస్తున్న నెంబర్ వన్ సెలెబ్రిటీ ఎవరంటే… ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో. ఇతను ఒక్కో పోస్ట్ కు రూ.11.9 కోట్లు వెనకేసుకుంటున్నాడు. రొనాల్డో తర్వాత హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్ రెండో స్థానంలో నిలిచాడు.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.