మహిళా జడ్జికి ఆకతాయి లాయర్ వేధింపులపై కేసు.

  0
  1585

  ఆకతాయిల వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం .. పోలీసులు కోర్టుకు పెడతారు.. కోర్టు శిక్ష విదిస్తుంది.. అయితే న్యాయవాది మహిళా జడ్జి పట్ల అనుచితంగా వ్యవహరిస్తే ఏమిచెయ్యాలి.. ? ఉత్తరాఖండ్ లో ఇదే జరిగింది. లక్సర్ అనే పట్టణంలో ఫ్యామిలీ కోర్టు మహిళా జడ్జి మొబైల్ కి , నవనీత్ తోమర్ అనే న్యాయవాది తరచూ ఫోన్లు చేస్తూ , మెస్సేజ్ లు పంపుతున్నాడు.. ఆమె చాంబర్లోకి పర్మిషన్ లేకుండానే పోయే ప్రయత్నం చేసాడు.. న్యాయవాదులకు సంబందించిన ఒక సభలో , ఆమె పక్కనే ఉండి ఫొటో తీసుకొని , ఆ ఫొటో ఫ్రేమ్ చేయించి , దానిని కొన్ని గిఫ్టులు కలిపి ఆమెకు పంపించే ప్రయత్నం చేశాడు.. అతడి ప్రయత్నాలను మహిళా జడ్జి ఎంతగా అడ్డుకున్నా , ఈ న్యాయవాది మాత్రం ఆమె మొబైల్ కి కాల్స్ చేయడం ఆపలేదు .. మెస్సేజ్ లు పంపడం మానలేదు. దీంతో మహిళా జడ్జి ఆకతాయి న్యాయవాది వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తనపై కట్టిన కేసును రద్దుచేయాలని అతడు హైకోర్టుకు పోయాడు. అయితే హైకోర్టు ఆకతాయి న్యాయవాది పిటీషన్ కొట్టివేసి , అతడిపై సూమోటోగా విచారణకు స్వీకరించి తమ ఎదుట హాజరుకావాలని నోటీసులు జారీచేసింది..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.