ఏకంగా చిరుతపులినే చంపేశాడు..

  0
  2348

  చిరుతపులి మీదకు వస్తుంటే ఎవరైనా ఏంచేస్తారు. రెండో మాటే లేదు, వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతారు. కానీ అక్కడ సిచ్యుయేషన్ వేరు. ఆ చిరుత తనతోపాటు, తన కుటుంబంపై కూడా దాడికి దిగింది. భార్య, కూతురిపై చిరుత దాడికి దిగడంతో ఆ వ్యక్తి రెప్పపాటులో స్పందించాడు. దానిపై దాడికి తెగబడ్డాడు. పోతే ప్రాణంపోతుంది, తనకు భార్య, బిడ్డ దక్కుతారు, పోరాటంలో గెలిస్తే అందరూ క్షేమంగా ఉంటారు. ఆ ఉద్దేశంతోటే చిరుతపై తిరగబడి ఏకంగా దాన్నే చంపేశాడు.

  అతని పేరు రాజగోపాల్. కర్ణాటకలోని హాసన జిల్లా అరసికెరె తాలూకా బైరగొండనహళ్లి వాసి. కుటుంబంతో కలసి అక్కడే నివాసం ఉంటున్నాడు. ఇటీవల బైక్ పై భార్య, కుమార్తెతో కలిసి బైరగొండనహళ్లి కొండ ప్రాంతంలో వెళ్తుండగా చిరుత అడ్డొచ్చింది. దాన్ని చూసి అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో వాహనం నుంచి భార్య, కుమార్తె కిందపడిపోయారు. వారిపైకి చిరుత దాడి చేసింది. గాయపరిచింది కూడా. అయితే వెంటనే రాజగోపాల్ చిరుతకి ఎదురు తిరిగాడు. చేతికి అందిన కర్రతో చితకబాదాడు. దీంతో చిరుత వారిని వదిలేసి రాజగోపాల్ పైకి తిరగబడింది. తలపై గాయం చేసింది. తీవ్రంగా రక్తమోడుతున్నా కూడా రాజగోపాల్ భయపడలేదు. చివరికి చిరుతను హతమార్చడంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. కుటుంబం కోసం చిరుతతో పోరాడిన రాజగోపాల్‌ నిజమైన హీరో అంటూ స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజగోపాల్‌ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

  ఇవీ చదవండి:

  అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

  ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

  ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?